King Grace To Brahmotsavam Audio?


మ‌హేష్ బాబు బ్ర‌హ్మోత్స‌వం  ఆడియో కు గెస్ట్  ఎవ‌రో తెలుసా సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం ఆడియో మే 1న  తిరుప‌తి శ్రీవారి స‌న్నిధిలో జ‌రుగుతుంద‌ని చెప్పిన చిత్ర యూనిట్ దాన్ని మే 7న హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక కు షిఫ్ట్ చేసిన విష‌యం తెలిసిందే. చిత్ర‌షూటింగ్ దాదాపు పూర్తి కావ‌స్తున్న నేప‌థ్యంలో చిత్ర ఆడియో వేడుక‌ను గ్రాండ్ గా నిర్వ‌హించే ప‌నిలో ప‌డింది చిత్ర యూనిట్. అయితే ఈ ఆడియోకి ఓ స్పెషల్ స్టార్ హీరో గెస్ట్ గా రాబోతున్నాడనే టాక్ గ‌ట్టిగానే వినిపిస్తుంది. మహేష్ అందరు స్టార్ హీరోలతో కలివిడిగా ఉంటాడు. కాబట్టి ఎవరిని గెస్ట్ గా పిలిచినా రాను అని చెప్పే అవకాశం లేదు. అయితే మహేష్ ఆడియోకు సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి వంటి విజ‌యాల‌తో దూసుకెళ్తున్న కింగ్ నాగార్జున రాబోతున్నాడని టాక్. నాగార్జున, మహేష్ లది మంచి రిలేషన్. ఎప్పుడూ టచ్ లో ఉండే వీరు అప్పుడప్పుడు స్పెషల్ పార్టీస్ కు అటెండ్ అవుతూ ఉంటారు. ఇక అఖిల్ ఆడియోకి మహేష్ వచ్చి విష్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు మహేష్ రాజకుమారుడు సినిమా ఆడియోకు నాగ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. అప్పటినుండి వారిద్దరి మధ్య ఆ బాండింగ్ అలానే ఉంది.మ‌ళ్లీ ఇప్ప‌డు బ్రహ్మోత్సవం ఆడియోకి స్పెషల్ గెస్ట్ గా నాగార్జున రావడం దాదాపు కన్ఫార్మ్ అయిన‌ట్టేన‌ట‌. ఇక పివిపి బ్యానర్ లోనే రీసెంట్ గా నాగార్జున ఊపిరి లాంటి హిట్ కొట్టాడు. కాబట్టి పివిపి అయినా సరే నాగ్ ను తీసుకు వచ్చే అవకాశం  ఎక్కువగా ఉంది. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఈ సమ్మర్ లో సూపర్ హిట్ అయ్యే అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఏం చేస్తుందో చూడాలి


Follow Us