Kattappa Son Entered Into Tfi


There are so many actors who got huge craze with few Telugu movies.. In them Bahubali -The begenning's KATTAPPA role became the most popular from a year. This role is carried by star actor Satya Raj. Now,his son too planning to screen on Telugu Industry. Hero ShibiRaj recently got hit from his Horror Thriller Movie. BindhuMadavi shared screen with ShibiRaj. This team is planning to release it's Telugu Version as well.. Will Katappa son can praise the Telugu Audience just like his Father..?? For this answer we have to wait till the release of this Horror Thriller..!
తెలుగులోకి క‌ట్ట‌ప్ప కొడుకు
తెలుగు తెర‌పై ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన న‌టీన‌టుల‌కెంద‌రికో మ‌న తెలుగు సినిమాల ప‌ట్ల ఆస‌క్తి ఎక్కువ‌. అలా తెలుగు సినిమాల్లో న‌టించి ఈ మ‌ధ్య పాపుల‌ర్ అయిన న‌టుల్లో క‌ట్ట‌ప్ప ఉర‌ఫ్ స‌త్య‌రాజ్ ఒక‌రు. బాహుబ‌లి లాంటి గొప్ప సినిమాలో క‌ట్ట‌ప్పగా ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యాడు. ఇప్పుడు ఆయ‌న కొడుకు శిబిరాజ్ కూడా తెలుగులో తెరంగేట్రం చేద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. అందుకే త‌మిళంలో తాను న‌టించిన జాక్స‌న్ దురై సినిమాను తెలుగులో దొర పేరుతో ఒకే రోజున రిలీజ్ చేయాల‌ని ఉత్సాహాన్ని క‌న‌బరుస్తున్నాడు. బిందుమాధ‌వి హీరోయిన్ గా న‌టించిన ఈ హారర్ థ్రిల్ల‌ర్ పై త‌మిళంలో మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమాతో క‌ట్ట‌ప్ప త‌న‌యుడు ఇక్క‌డి ఆడియ‌న్స్ కు చేరువ అవుతాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.


Follow Us