Jr. Ntr Shocked With That News


డ్యాన్స్, ఫైట్స్, యాక్ష‌న్ లో త‌న‌కంటూ ఒక సొంత క్రేజ్ ను సంపాదించుకుని త‌న‌దైన స్టైల్ లో తెలుగు ఇండ‌స్ట్రీలో మాస్ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. సీనియ‌ర్ ఎన్టీఆర్ కు మ‌న‌వ‌డిగా వ‌చ్చి తాత‌కి త‌గ్గ మ‌న‌వ‌డు అనిపించుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ తాజాగా ఒక వార్త విని షాక్ కి గుర‌య్యాడ‌ట. movie-poster బోయ‌పాటి శ్రీను, జూనియ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ద‌మ్ము సినిమా తెలుగులో బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్నంత విజ‌యం సాధించ‌ని విష‌యం తెలిసిందే. అయితే ఇదే ఫ్లాప్ సినిమా ద‌మ్ము ను బాలీవుడ్ లో సుల్తాన్ పేరుతో డ‌బ్ చేశారు. నెల ప‌దిహేను రోజుల కింద‌ట యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఈ సినిమాను నెటిజ‌న్లు విరిగ‌బ‌డి చూస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఏకంగా కోటి వ్యూస్ తో సంచ‌ల‌నం సృష్టించింది ఈ తెలుగు ఫ్లాప్ సినిమా.కానీ తెలుగులో వస్తున్న యాక్షన్ చిత్రాలను మాత్రం హిందీ వాళ్లు వాళ్ల భాష‌లో డబ్ చేస్తూ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రాన్ని ''సుల్తాన్ '' పేరుతో డబ్ చేసి యు ట్యూబ్ లో అప్ లోడ్ చేయగా కోటి వ్యూస్ దాటడం విని ఎన్టీఆర్ సైతం షాక్ అయ్యాడట. ఎన్టీఆర్ మాత్రం తెలుగు లో ఈ సినిమాకు ఆద‌ర‌ణ ల‌భించక‌పోయినా హిందీలో అయిన గౌర‌వం ద‌క్కింద‌ని తెగ సంబ‌రప‌డిపోతున్నార‌ట‌.