Janatha Garage Shifted To Chennai


రేప‌టి నుంచి చెన్నైలో జ‌న‌తా గ్యారేజ్..
కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' షూటింగ్ అనుకున్న ప్రకారం చకచకా జరిగిపోతోంది. హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ ను రేపటి నుంచి చెన్నైలో ఆరంభించనుంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పై ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అందుకే మే28న స్వ‌ర్గీయ తార‌క రామ‌రావు గారి జ‌యంతి అయినా, షెడ్యూల్ ఆల్రెడీ ప్లాన్ చేయ‌డంతో ఈరోజు ఉద‌య‌మే ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి జూనియ‌ర్ త‌న నివాళులు అర్పించారు.
చైన్నై నుంచి తిరిగి హైదరాబాద్‌కి వ‌చ్చాక‌, అన్నపూర్ణ స్టూడియోలో ఒక పాటను చిత్రీకరించనున్నారు. జూన్ నెలాఖ‌రికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు మేక‌ర్స్. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో త్వ‌ర‌లోనే టీజ‌ర్ ను కూడా విడుద‌ల చేయ‌నున్నారు. రీసెంట్ గా ఓ మరాఠి నటుడిని విలన్ గా తీసుకున్నారు. బలమైన కథా కథనాలు .. భారీ తారాగణం ఉన్న కారణంగా ఈ సినిమాపై అభిమానులకి అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. చూద్దాం ఎన్టీఆర్ పాత రికార్డుల‌న్నింటినీ తిరగ‌రాస్తాడో లేదో..


Follow Us