Janatha Garage First Look On May 19th


Social Media Promotion's...This is the newest trend going in industry..                                                                                               Commercial movie or short film , we can find any update in social media.. From the day one starting from Traditional pooja ceremony to release day with better collections at box office news is first being posted in social media by unit members for better Promotions to their project's.. In this race every one are trying to be first to give updates.. After their success with Nannaku prematho hero Jr.NTR & Sreemanthudu director Koratala Siva are working together for  JANATHA GARAGE produced by Mythri Movies is almost done with half of the shooting. Fans are eagerly waiting for it's First look & date is declared recently. On the occasion of Jr.NTR's Birth Day ( May-20th ) team wanted to release the poster as a gift. It's been declared officially by the unit of Janatha Garage " On May-19th evening 6pm we are launching first look". In present days it is going tough & important for Telugu movies at overseas market .so to get noticed team is planning their Audio release function at America & Audio success meet at Hyderabad , Viayawada, Vizag & Tirupathi .. JG Audio Date will be declared soon...   ఈ మధ్య సినిమా ముహుర్తం షూట్ నుంచి రిలీజ్ అయి మొత్తం క‌లెక్ష‌న్లు సాధించే వ‌ర‌కు సోషల్ మీడియాలో ఏదో ర‌కంగా హ‌ల్ చ‌ల్ చేయ‌డం కామ‌న్ అయిపోయింది. ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్, ట్రైల‌ర్ అంటూ దేనినీ వ‌ద‌ల‌కుండా సినిమాను బాగా ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. నాన్న‌కు ప్రేమ‌తో త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, శ్రీమంతుడు త‌ర్వాత కొర‌టాల శివ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీస్ సంస్థ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే దాదాపుగా పూర్త‌యింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జ‌న‌తా గ్యారేజ్ ఫ‌స్ట్ లుక్ డేట్ ఖ‌ర‌రాయింది. స‌మంత‌, నిత్య మీన‌న్ హీరోయిన్లు గా న‌టిస్తున్న ఈ సినిమాలో మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఓ కీల‌క‌పాత్రను పోషిస్తుండ‌గా.. సాయికుమార్ ఎన్టీఆర్ కు తండ్రిగా న‌టిస్తున్నాడు. మే 20 న త‌న పుట్టిన రోజు కానుక‌గా జ‌న‌తాగ్యారేజ్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయాల‌ని ఎన్టీఆర్ మొద‌టి నుంచే ఫిక్స్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ విష‌యాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. జ‌న‌తాగ్యారేజ్ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను మే 19 సాయంత్రం 6గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. అంతే కాదు జ‌న‌తా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ను కూడా చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తుంది. ప్ర‌స్తుతం కాలంలో తెలుగు సినిమాల‌కు ఓవ‌ర్సీస్ మార్కెట్ కీల‌కంగా మారింది. దీంతో ఓవ‌ర్సీస్ మార్కెట్ పై ప‌ట్టు కోసం ఆడియోను అమెరికాలో రిలీజ్ చేయాల‌ని మూవీ టీమ్ అనుకుంటుంది. ఆడియో స‌క్సెస్ ఈవెంట్ మాత్రం హైదరాబాద్, విజ‌య‌వాడ‌, వైజాగ్, తిరుప‌తిల‌లో నిర్వ‌హించాల‌ని ప్లాన్ వేసింది జ‌న‌తా గ్యారేజ్ యూనిట్.


Follow Us