ట్రైల‌ర్ టాక్ః ఇరుముగ‌న్


inkokkadu డైర‌క్ట‌ర్ ఆనంద్, హీరో విక్రమ్ కాంబినేష‌న్ లో ఇరుముగ‌న్(ఇంకొక్క‌డు) అనే చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. విక్ర‌మ్ భార్య పాత్ర‌లో న‌య‌న‌తార‌, సీక్రెట్ ఏజెంట్ గా నిత్య మీన‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ మ‌లేసియాలోనే జ‌రిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను కొద్ది సేప‌టి క్రితం రిలీజ్ చేశారు. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో కొన‌సాగ‌నున్న ఈ సినిమాలో విక్ర‌మ్ డ‌బుల్ రోల్ ప్లే చేశాడ‌నే విష‌యం ట్రైల‌ర్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఓ ప‌క్క ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ గా, మ‌రో ప‌క్క హిజ్రా విల‌న్ గా విక్ర‌మ్ న‌ట‌న‌తో చించేశాడు. మ్యూజిక్, విజువ‌ల్స్ చూస్తుంటే సినిమా హాలీవుడ్ రేంజ్ ని త‌ల‌పిస్తుంది. చూస్తుంటే నిత్య మీన‌న్ క్యార‌క్ట‌ర్ త‌క్కువ సేపే ఉండేట్లు ఉంది . కానీ న‌య‌న‌తార మాత్రం త‌న అందాల‌ను సినిమాలో బాగానే ఆర‌బోసిన‌ట్లుంది. ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది.


Follow Us