యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ హర్రర్‌తో వస్తోన్న 'ఇది పెద్ద సైతాన్‌' 


విజయ్‌ రాఘవేంద్ర హీరోగా హరిప్రియ హీరోయిన్‌గా ఆదిరామ్‌ దర్శకత్వంలో కన్నడంలో ఎస్‌.రమేష్‌ నిర్మించిన 'రణతంత్ర' చిత్రం సమ్మర్‌లో రిలీజై సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్రావ్‌ మార్టోరి 'ఇది పెద్ద సైతాన్‌' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 30న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్రావ్‌ మార్టోరి చిత్ర విశేషాలను తెలియజేశారు.  యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ హర్రర్‌!!  నిర్మాత వెంకట్రావ్‌ మార్టోరి మాట్లాడుతూ - ''2016 సమ్మర్‌ కానుకగా కన్నడంలో రిలీజైన 'రణతంత్ర' చిత్రం పెద్ద హిట్‌ అయ్యింది. లవ్‌ అండ్‌ యాక్షన్‌ రొమాంటిక్‌ హర్రర్‌గా రూపొందిన ఈ చిత్రం విజయరాఘవేంద్ర కెరీర్‌లో నెంబర్‌వన్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని 'ఇది పెద్ద సైతాన్‌' పేరుతో తెలుగులో మా బేనర్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం. అచ్చ తెలుగు అమ్మాయి హరిప్రియ హీరోయిన్‌గా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ చిత్రంతో హరిప్రియ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. దర్శకుడు ఆదిరామ్‌ టేకింగ్‌ ఎక్స్‌లెంట్‌గా వుంది. తెలుగులో వచ్చిన హర్రర్‌ చిత్రాలు చాలా వరకు పెద్ద సక్సెస్‌ అయ్యాయి. అలాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. కంటెంట్‌ బాగుంటే చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. రీసెంట్‌గా 'బిచ్చగాడు' చిత్రం ఎంత సెన్సేషన్‌ సృష్టించిందో అందరికీ తెల్సిందే. అలాగే ఈ చిత్రంలో కూడా మంచి కంటెంట్‌ వుంది. శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ బేనర్‌లో 'మహాబలి', 'గోలీసోడా', 'ఇది పెద్ద సైతాన్‌' చిత్రాల్ని రిలీజ్‌ చేస్తున్నాం. అలాగే తెలుగు స్ట్రెయిట్‌ మూవీని పెద్ద స్టార్‌ కాస్టింగ్‌తో దసరాకి ప్రారంభించడానికి ప్లాన్‌ చేస్తున్నాం. మా డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ ఎంతో సపోర్ట్‌ చేస్తున్నారు. వారి సహకారంతో మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించడానికి కృషి చేస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చే చిత్రాలను మా బేనర్‌లో నిర్మిస్తాం. సెన్సార్‌ పూర్తయిన 'ఇది పెద్ద సైతాన్‌' చిత్రాన్ని సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.  విజయ్‌ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్‌ ఎం.,  నిర్మాత: వెంకట్రావ్‌ మార్టోరి, 
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఆదిరామ్‌. 


Follow Us