Huge Offers For Nayan From Kollywood


మొద‌టి సినిమా నుంచి ప‌దేళ్ల పాటు ఆగ‌కుండా సినిమాల మీద సినిమాలు చేసింది ఈ అమ్మ‌డు. ర‌క‌ర‌కాల కాంట్ర‌వ‌ర్సీల్లో ప‌డీ, లేచి ఇక చాలు అన్నఫీల్ ను ప్రేక్షకుల్లో క‌లుగచేసింది. ఇక ఈ భామ కెరీర్ అయిపోయిందిలే అనుకున్నారు. దీనికి బ‌లాన్ని చేకూరుస్తూ ముగ్గురితో పెళ్లి మ్యాట‌ర్ ను తెచ్చింది. ఈ తార లైఫ్ లో ఇన్ని సినిమాలు చూపించాక ప్రేక్ష‌కులు ఆమెను హీరోయిన్ గా ఊహించుకోలేరు.
 న‌య‌న‌తార‌. చంద్రముఖి తో మొద‌లుపెట్టి సింహా వ‌ర‌కు వ‌రుస‌గా సినిమాలు తీస్తూనే ఉంది. కానీ ప‌రిస్థితులు త‌న చేతుల్లో లేక ఆ టైమ్ లో ఆవిడ‌గారిపై వ‌చ్చిన మాట‌ల‌న్నీ రీజ‌న‌బుల్ గా ఉండ‌టంతో మ‌న టాలీవుడ్ లో న‌య‌న్ కు బ్యూటీ పాత్ర‌లు ఇవ్వ‌కుండా త‌ల్లి పాత్ర‌లు  ఇవ్వ‌డం మొద‌లెట్టారు. అదేంటో కానీ, కోలీవుడ్లో మాత్రం అమ్మడికి తనకంటే ఏజ్ లో చిన్నవారైనా హీరోలతో రొమాంటిక్ సినిమాలు చేసుకునే అవకాశాలొస్తున్నాయి. నయన్ పై తెలుగు జనాలకు మొఖం మొత్తితే... తమిళులకు మాత్రం ఈవిడగారు ఇంకా ఆరాద్య దేవతగానే కొనసాగుతుంది..
తమిళ తంబీల మైండ్ సెట్ చూసిన నయన ఇపుడు పనిలో పనిగా తనకు టాప్ హీరో విజయ్ తో చేయాలని ఉందంటూ ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది.ఇక నయన్ కు ఇన్ని ఆఫర్లు రావడం వెనుక మరో రీజన్ మాత్రం  ఆమె ఫిగర్ బాగుంటుందనో లేక అంతకు మించి మరేదో ఆఫర్ చేస్తుందనో కాదు. కేవలం నయన్ యాక్ట్ చేసే చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కురిపించడం.


Follow Us