Energetic Star Ram Teamup With Karunakaran Again


క‌రుణాక‌ర‌న్‌కి మ‌ళ్లీ ఛాన్స్ ఇచ్చిన ఎన‌ర్జిటిక్ స్టార్
 
మామూలుగా ఒక్కో డైర‌క్ట‌ర్ కి ఒక్కో స్పెష‌ల్ ఉంటుంది. అందులోనూ ల‌వ్ స్టోరీల విష‌యంలో కొంత‌మంది డైర‌క్ట‌ర్స్ కి మంచి అభిరుచి ఉంటుంది. త‌మిళ‌నాడుకి చెందిన వాడైనా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో క‌రుణాక‌రన్ ఒక‌రు. ల‌వ్ స్టోరీల‌ను డిఫరెంట్ గా అందించ‌గ‌ల డైర‌క్ట‌ర్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తొలిప్రేమ‌, సుమంత్ తో యువ‌కుడు, వెంక‌టేష్ తో వాసు, బ‌న్నీతో హ్యాపీ, ప్ర‌భాస్ తో డార్లింగ్, ఇలా అనేక ల‌వ్ స్టోరీస్ తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లిగాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆల్రెడీ రామ్ తో ఎందుకంటే ప్రేమంట అనే చిత్రాన్ని కరుణాక‌ర‌న్, ఇప్పుడు మ‌ళ్లీ ఓ రొమాంటికీ డ్రామాని తీసేందుకు రెడీ అవుతున్న నేప‌థ్యంలోనే ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ను క‌లిశాడ‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో రామ్ కూడా ఓకే చెప్పేశాడ‌ట‌. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి కథ కూడా సిద్ధ‌మైంద‌ని తెలుస్తుంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వచ్చిన చిత్రం మూవీ క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ కాక‌పోయినా, ఎవ‌రికీ చెడ్డ‌పేరైతే తీసుకురాలేదు.
నేను..శైల‌జ విజ‌యం త‌ర్వాత బాగా ఆలోచించి సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న రామ్, ఈ సినిమా షూటింగ్ ను జూన్ లో మొద‌లుపెట్ట‌నున్నాడు. ఈ సినిమా పూర్త‌వ‌గానే ఎనర్జ‌టిక్ హీరో చేయబోయే మూవీ క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనే ఉంటుందంటున్నారు. కానీ దీని గురించి అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.


Follow Us