Chiru Comes For His Daughter ?


కూతురు కోసం చిరంజీవి వ‌స్తాడా..? మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ నిహారిక హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ''ఒక మనసు'' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో యంగ్ హీరో నాగశౌర్య నిహారికకు జోడీగా నటిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో త్వరలో రిలీజ్ కానుంది. రామరాజు దర్శకత్వంలో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'ఒక మనసు' మూవీ ఆడియోను మే సెకండ్ వీక్  లో విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ ఫంక్షన్‌కు నిహారిక సోదరుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,స్టైలిష్  స్టార్  అల్లుఅర్జున్ చీఫ్ గెస్ట్‌లుగా రానున్నారు. తమ కుటుంబం నుంచి వస్తున్న తొలి హీరోయిన్ కావడం, అదే కాక ఒక్క‌గాని ఒక్క వార‌సురాలు కావ‌డం, అన్నింటికి మించి కూతురు మీదున్న ప్రేమ‌తో నిహారిక లాంఛింగ్ మూవీ ఆడియో ఫంక్షన్‌కు మెగా స్టార్ చిరంజీవి కూడా హాజరు కానున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నాగేంద్ర బాబు, వరణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌లు ఎలాగూ నిహారిక సినిమా ఫంక్షన్‌కు హాజరవుతారు. పవన్ కల్యాణ్ మినహా మిగిలిన మెగా ఫ్యామిలీ అంతా వేదికపై మెరిసే అవకాశం ఉంది.


Follow Us