Brahmotsavam Review


BRAHMOTSAVAM COOL MOVIE IN HOT SUMMER REVIEW

The Most awaiting Brahmotsavam is out for audience... Today morning (May-20-2016) Brahmotsavam hit Theaters all over the world.. For the first time in TFI one movie is released world wide more than 3000 theaters.. It's a record for the team releasing in huge number of theaters... Starring Mahesh Babu , Samantha , Kajal Agarwal , Pranitha subhash in leading roles.. >> Director Srikantha Addala. >> Producers Potluri vara Prasad ( PVP Creations ) & Mahesh ( MB Entertainment ) >> Music by Mickey J.Meyer >> Editor Kotagiri Venkateswara Rao >> Cinematography R.Rathnavelu ( Randy ) Brahmotsavam showered its festive colors on Mahesh's admirers .. From the begining of the film complete unit ,first and formost Hero Mashesh stood for promoting the film. Trailer to Release unit members promoted Brahmotsavam like a festival in the hot summer. First look posters , Teasers , Mahesh's Promotions all these events acquired a tremendous response from Mahesh Babu fans, he got more than a million views for his events. Its been a huge swing of talk that Brahmotsavam is a complete family entertainer.. Every supporting actor is extraordinary with their roles, especially Satya Raj as hero's Father Character steal the show. This time also Director Srikanth Addala didn't mention our hero with any name..it looks like director is making his own record in not mentioning name from beginning to end. Mahesh impressed every one from the first scene of the film to ending.. Movie is fully filled with sentimental acts & have hilarious comedy. Trailer itself revealed the story line of the movie as it was fully filled of family drama with veteran actors. The Music Director Micky J meyer , who has given his best beautiful music this season..No doubt he is in race with leading Music Directors in the industry. There are note worthy dialogues and eye catching cinematography through out the film.. Getting into detail... Mahesh Babu is son of an industrialist in Vijaywada. His father Sathya Raj loves to lead life celebrating festivals with his relatives and family members together. When his brother-in- law Rao Ramesh who is hoping that Mahesh marries his daughter Pranitha,but unfortunately he watch Mahesh kissing Kajal Agarwal. He walks out of the family and leaving Mahesh Babu’s father devastated. The tragedy in his family makes Mahesh Babu to find the extended family that is living all over India. Mahesh Babu has proven himself that he excels in classy dramas where emotions matter more. After “Athadu” and “Seethamma Vaakitlo Sirmalle Chettu”, he has come up with another sincere performance in Brahmotsavam. When we watch posters it looks like samantha is the lead,but lead heroine is Kajal.. Kajal is satya raj friend's daughter ,she visits them in her trip to india.From here Kajal & Mahesh's love track starts... They both get break up as Kajal likes to live life independently than being with joint family. Samantha is Mahesh's sister friend...Though these two don't have much love scenes in between,both were good on screen. The story has a twist in the interval block but later loses its way in fulfilling the desire of Mahesh to find his family roots right upto the seventh generation. Mahesh looked handsome more than performance , that is impressive. Hero carried the film on shoulders till the end even as the movie proceeds in dull manner. When satya Raj dies movie goes too senti which audience cant take it in these days. Performance of Co-stars : When we speak about Co-stars, There are so many legendary actors in this film. But no one have any lengthy drama carried by them. Satyaraj steals the show with his dignified acting and graceful paras on life and living. He is the soul of the film. After “Mirchi” and “Bahubali”, this is a milestone for his career in Telugu films. Jayasudha and Revathi say their lines well but the screen should have got off between them with some scenes set up together. Tulasi actually gets the better lines between the three lady characters. In first half comedy was carried out little with Rao Ramesh & Vennela Kishore is the only one who infuses some comedy in the second half. The talented child artist Avantika should have got atleast one line to say in the film. Krishna Bhagwan fails to fire us to laughter this time in Brahmotsavam. In the starting of the film itself Mahesh have emotional skype chat with his sister & director narrated how she is connected to the family,but point is when Satya Raj dies she didn't visit the family & not even in any occasion in the whole film.This breaks the link of sentiment scenes in the beginning.This time Pranitha role didn't have much dialogues ,It is a silent character. Samantha sizzles the screen better with his vivacity than the glamour sprinkled by Kajal Agarwal. Cinematography by Ratnavelu is terrific and the set design by Thota Tharani stand out. The Brahmotsavam set looks truly authentic and gives you the divine feeling. Music by Mickey J Meyer is quite pleasing to the ears but the blame must fall on the director for imbalance the rhythms by placing five songs in the first half and only two in the second half which screws up the whole pace of the film. Gopi Sundar seems to have used his extra-sensory perceptions about the film’s narrative using Back ground music, at many places in a way that the director couldn’t have matched up. “Brahmotsavam” starts to rekindle sentiment in old Gen families but failed to capitalize on the promise. It is barely watchable and might not pick up steam. Bahmotsavam is high peak in sentiment which is little hard to carry out by this generation people. It was a nice try Srikanth Addala for sharing the message that we are living in a mechanical which we have to over come ..!! Punch Line : Is it Really necessary to think about Story in depth..?? It is Mahesh's film.. FILMJALSA Rating : 3.25/5
టాలీవుడ్ లో శ్రీమంతుడు త‌ర్వాత మ‌హేష్ బాబు నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ కు వ‌చ్చేశాడు. అలాంటి శ్రీమంతుడు త‌ర్వాత మ‌హేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో సినిమా అంటే మొద‌టి నుంచి భారీగానే అంచ‌నాలుండ‌టం స‌హ‌జం. వీరిద్దరూ క‌లిసి ఇచ్చిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఇప్ప‌టికీ టీవీలో వ‌స్తే మిస్ అవ‌కుండా చూస్తుంటాం. అలాంటి వాళ్లు మ‌ళ్లీ సినిమా తీస్తే ఏ ప్రేక్ష‌కుడు మాత్రం ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌డు.. ఇప్ప‌టికే శ్రీమంత‌డు బ్లాక్ బ్ల‌స్ట‌ర్ తో ఫామ్ లో ఉన్న మ‌హేష్‌, త‌న ఫామ్ ను ఎంత‌వ‌ర‌కు కంటిన్యూ చేశాడో చూద్దాం.
 
శ్రీమంతుడు త‌ర్వాత మ‌హేష్ న‌టించిన సినిమా బ్ర‌హ్మోత్స‌వం.స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, ప్ర‌ణీత ముగ్గురు హీరోయిన్లుగా తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పీవీపీ బ్యాన‌ర్‌ఫై తెర‌కెక్కిన ఈ సినిమాపై అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.
ఒక మ‌నిషి నలుగురి మ‌ధ్య ఉండాల‌నే ఆలోచ‌న నుంచి వ‌చ్చిన క‌థే ఈ బ్ర‌హ్మోత్సవం. బంధుత్వాల విష‌యంలో అంతా యాంత్రికంగా మారిన కాలంలో వాటి గొప్ప‌త‌నాన్ని చాటుతూ శ్రీకాంత్ చేసిన ఈ ప్ర‌య‌త్నం మెచ్చుకోద‌గిన‌ది. ప‌దిమంది ఒక ద‌గ్గ‌ర క‌లిస్తేనే పండ‌గ‌లా ఉంది, అదే ప‌దిమంది రోజూ క‌లిస్తే బ్ర‌హ్మోత్స‌వమే అంటూ సమంత డైలాగ్ తో సినిమా మొద‌ల‌వుతుంది. క‌ట్ చేస్తే ఒక పండుగ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించే ఇంట్లో నెక్స్ట్ సీన్. మ‌హేష్ బాబు, తన తండ్రికి చెప్పులు తొడిగే సీన్. ఎంట్రీలోనే త‌న క్యారెక్ట‌రైజేష‌న్ రివీల్ చేశాడు ద‌ర్శ‌కుడు.
 
లండ‌న్ లో ఉన్న మ‌హేష్ చెల్లితో స్కైప్ లో మాట్లాడే సీన్ కి అంద‌ర్ని క‌నెక్ట్ చేస్తుంది. భ‌ర్త‌గా, మ‌హేష్ కి మావ‌య్య గా రావు ర‌మేష్ త‌న మొఖంలో ఆనందం లేకుండా, ఎప్పుడూ దేనికోస‌మో ఆలోచిస్తున్న‌ట్లు ఉండ‌టం, దీనికితోడు ఆనిమేషన్ రావు గోపాల‌రావు, రావు ర‌మేష్ తో మాట్లాడే సీన్స్ బాగా పండాయి. స‌త్య‌రాజ్ స్నేహితుడి కూతురిగా విదేశాల నుంచి వ‌చ్చిన కాజ‌ల్ తో మ‌హేష్ ల‌వ్ ట్రాక్ ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. కానీ కాజ‌ల్ ఏక‌త్వం కోరుకునే అమ్మాయి కావ‌డంతో మ‌హేష్ ని వ‌దిలి వెళ్లిపోతుంది. ప్రీ ఇంట‌ర్వెల్ సీన్ లో రావు ర‌మేష్ మాట‌లు, స‌త్య రాజ్, మహేష్ న‌ట‌న అక్కడ ఎమోష‌న్స్ ని బాగా హైలెట్ చేశాయి.
 
మ‌హేష్ చెల్లి ఫ్రెండ్ గా లండ‌న్ నుంచి వ‌చ్చిన స‌మంత‌తో, త‌న తండ్రి ఆశ‌యాన్ని నిల‌బట్ట‌డానికి ఏడు త‌రాల కుటుంబీకుల‌ను వెతికే సీన్ ఏదో జ‌స్ట్ ఉంది అంటే ఉంది అన్న‌ట్లు చూపిస్తే పోయేది అలా కాకుండా దాదాపు ఒక అరగంట చూపించేస‌రికి ఎవ‌రికీ క‌నెక్ట్ అవ‌క‌పోవ‌డంతో పాటు, 156 నిమిషాలను క‌వ‌ర్ చేసుకోవ‌డానికి ఇది కూడా ఒక‌టి పెట్టేరేమో అనిపిస్తుంది. స‌మంత‌, మ‌హేష్ ల మ‌ధ్య ల‌వ్ స్టోరీ కూడా పెద్ద‌గా ఉండ‌దు. చివ‌ర‌గా ప్ర‌ణీత పెళ్లిలో రావు ర‌మేష్ రియ‌లైజేష‌న్, మ‌హేష్ న‌ట‌న అద్భుతం. కానీ ప్ర‌ణీత పెళ్లికి మ‌హేష్ కే పిలుపు లేదు. అలాంటిది మ‌హేష్ పిలిచాడ‌ని త‌మ ఏడుత‌రాల పూర్వీకులు రావ‌డం ఏంటో అర్థం కాదు. ఫ‌స్టాఫ్ లో మ‌హేష్ చెల్లికి, త‌ల్లిదండ్రుల‌కు క్రియేట్ చేసిన సీన్ చూస్తే వారిమ‌ధ్య ప్రేమ ఎంతటి గొప్ప‌దో అనుకుంటారు. కానీ అలాంటి మ‌హేష్ చెల్లి త‌న తండ్రి చనిపోయిన‌ప్పుడు రాదు, ఇంట్లో ఎటువంటి శుభ‌కార్యానికీ రాక‌పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో.. పోనీ అక్క‌డ మ‌హేష్ చెల్లికి అత్తింటివారి నుండి ఏదైనా స‌మస్య ఉందా అంటే అదీ చూపించ‌లేదు.
 
ఎంతో మంది పెద్ద పెద్ద న‌టులు న‌టించిన‌ప్పటికీ వారికి న‌టించే ఛాన్స్ ఎక్క‌డా రాలేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ప్ర‌తి ఫ్రేమ్ చాలా అందంగా, క‌న్నుల పండుగ‌గా ఉంటుంది. మహేష్ తన స్క్రీన్ ప్రేజెన్స్ తో ముఖ్యంగా తండ్రి చనిపోయినప్పుడు మహేష్ నటన అద్భుతం అని చెప్పాలి.హీరోయిన్లు కాజ‌ల్, స‌మంత మ‌హేష్ కి బాగా ఒదిగిపోయారు.అమాయ‌క‌పు మ‌ర‌ద‌లి పాత్ర‌లో ప్ర‌ణీత న‌టించిన‌ప్ప‌టికీ త‌న‌కు అంత‌గా న‌టించే ఛాన్స్ రాలేదు. గోపీ సుంద‌ర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప‌ర్లేద‌నిపిస్తుంది. మ‌హేష్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని ఒక కొత్త ల‌వ్ ట్రాక్ చేశాడు ఈ సినిమాలో. ఇంట‌ర్వెల్ కి ముందు రావు ర‌మేష్ అద‌ర‌గొట్టాడు. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ న‌వ్వు తెప్పిస్తుంది. సినిమా ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్, తోట త‌ర‌ణి వేసిన సెట్స్ చాలా బాగున్నాయి.
 
ఫ‌స్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా వ‌ర‌కు తగ్గింద‌నే చెప్పాలి. క‌థ లేకుండా సాగ‌దీయ‌డం, డైర‌క్ట‌ర్ స్క్రీన్ ప్లే విష‌యంలో ఇంకొంచెం జాగ్ర‌త్త తీసుకుని ఉంటే బాగుండేది. మిక్కీ జే మేయ‌ర్ పాట‌లు స‌మ‌యం సంద‌ర్భం లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వ‌చ్చి చికాకు తెప్పిస్తాయి. మ‌హేష్, కాజ‌ల్ మ‌ధ్య‌న కుదిరిన రొమాన్స్, మ‌హేష్, స‌మంతల మ‌ధ్య సెట్ అవ‌లేదు. పోనీ ఎంట‌ర్ టైన్ మెంట్ అయినా ఉందా అంటే అదీ లేదు. ఇంత‌టి సెంటిమెంట్ లు ప్ర‌జెంట్ జన‌రేష‌న్ కి పెద్ద‌గా ఎక్క‌కపోవ‌చ్చు. దీనికి తోడు అవ‌స‌రం లేని సీన్స్ రావ‌డంతో సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుడికీ, క‌థ‌కి మ‌ధ్య క‌నెక్ష‌న్ మిస్ అవుతుంది.
 
పంచ్ లైన్ః క‌థ గురించి పెద్ద‌గా ఆలోచించ‌లా...
Filmjalsa Rating : 3.25/5


Follow Us