Bhoomika Re-entry


తెలుగు తెర‌పై అంద‌మైన అభిన‌యానికి ప్ర‌తీక‌గా చెప్పుకున్న క‌థానాయిక‌ల‌లో భూమిక కూడా ఉంది. తెలుగు, త‌మిళ భాష‌ల‌తో పాటు మ‌లయాళ భాష‌లోనూ ఆమెకు లెక్క‌లేనంత మంది అభిమానులున్నారు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగ‌ల‌దు అన్న ముద్ర‌ను కూడా సంపాదించుకుంది. అలాంటి ఆమె కెరీర్ బాగున్న టైమ్ లో పెళ్లి చేసుకుని సినిమాల సంఖ్య త‌గ్గించుకుంది. అయితే ఇంత కాలం గ్యాప్ తీసుకున్న ఆమె క‌న్న‌డ‌లో రీ ఎంట్రీ ఇస్తుంది.ఇంద్ర‌జిత్ లోకేష్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఐ ల‌వ్ యూ అలియా అనే సినిమాలో ఈమె న‌టిస్తుంది.
భూమిక ప్రధాన పాత్రగా నడిచే ఈ సినిమాలో, భూమిక డాన్స్ టీచర్ పాత్రను పోషించింది. భర్త ఆదరణకి దూరమై .. ఆయన నుంచి విడాకులు కోరుకునే పాత్రను ఆమె అద్భుతంగా పోషించిందట. ఈ తరహా పాత్రను నేను ఇంతవరకూ చేయలేదని స్వ‌యంగా భూమికే చెప్ప‌డం విశేషం. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, భూమికకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.


Follow Us