Bharath Ane Nenu First Look Release Date


'బ్ర‌హ్మోత్స‌వం' త‌ర్వాత, మురుగదాస్ తో మ‌హేష్ తీసిన 'స్పైడ‌ర్' ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన‌ప్ప‌టికీ, ఆ అంచనాల‌ను అందుకోలేక అభిమానుల‌కు చేదు అనుభ‌వాల్ని మిగిల్చింది. స్పైడ‌ర్ త‌ర్వాత మ‌హేష్ ప్ర‌స్తుతం త‌న‌కు 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ ను అందించిన‌ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'భ‌ర‌త్ అనే నేను' సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆల్రెడీ మ‌హేష్- కొర‌టాల కాంబినేష‌న్ లో వ‌చ్చిన శ్రీమంతుడు బాగా విజ‌యం సాధించ‌డం, కొర‌టాల ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన మూడు సినిమాలూ బ్లాక్ బ్ల‌స్ట‌ర్లు కావ‌డంతో ఈ సినిమా పై ప్రేక్ష‌కులు బాగా హోప్స్ పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే, ఏప్రిల్ లో విడుద‌ల కానున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను నూత‌న సంవ‌త్స‌రం కానుక‌గా నాలుగు నెల‌ల ముందే లాంఛ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తుంది మూవీ యూనిట్. డిసెంబ‌ర్ 31వ తేదీ రాత్రికే సోష‌ల్ మీడియాలో ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేసి, త‌ర్వాతి రోజు అంటే జ‌న‌వ‌రి 1న పేప‌ర్ల‌లో కూడా యాడ్స్ ఇస్తార‌ని తెలుస్తుంది. ఎంతో కాలంగా శుభ‌వార్త కోసం ఎదురుచూస్తున్న మ‌హేష్ అభిమానుల‌కు ఈ వార్తతో మ‌హేష్ ఫ్యాన్స్ తెగ సంతోష‌ప‌డి పోతున్నారు. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 



Follow Us