Anushka Sharma First Look In Sulthan


బాలీవుడ్ హాట్ భామల్లో ఈ హీరోయిన్ ఒకరు. ఈ సుందరాంగి నుంచి పెర్ఫామెన్స్ కేరక్టర్లు ఎక్స్ పెక్ట్ చేయడంలో ఏ మాత్రం తప్పు లేదు. కానీ మరీ ఫైటర్ రెజ్లర్ అవతారం ఎత్తేస్తే ఎలా ఉంటుంది.. ఇప్పటివరకూ దీనిపై ఆలోచన తప్ప క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సుల్తాన్ లో.. ఆ హీరోయిన్ ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేసింది యూనిట్. సుల్తాన్ లో అనుష్క శర్మ.. ఆర్ఫా అనే పాత్రలో కనిపిస్తోంది. ఓ మల్లయుద్ధ వీరుడిని ఎత్తి పడేస్తున్న ఈమెను చూస్తే.. సుకుమారి అనే మాటను మర్చిపోవాల్సిందే. ఆ రేంజ్ లో ఫైటింగులు చేసేస్తోంది. ఈ పాత్ర చేసేందుకు అనుష్క బోలెడు ట్రైనింగ్ కూడా తీసుకుంద‌ట‌. కొన్ని నెలలపాటు ట్రైనింగ్ అయి.. మల్ల యుద్ధాల సన్నివేశాల్లో పాల్గొంద‌ట  అనుష్క. కొన్ని రోజుల క్రితం సల్మాన్ కూడా ఇలాంటి షాక్ నే ఇచ్చాడు. ఇప్పటివరకూ సల్లూ భాయ్ కనిపించనంత స్ట్రెంగ్త్ చూపించాడు. ఈ పవర్ ఫుల్ రోల్ కి సల్మాన్ సరిగ్గా న్యాయం చేశాడనే కామెంట్స్ వినిపించాయి.ఏదేమైనా రాకుమారిలా క‌నిపించి నిన్న‌టి వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన అనుష్క శ‌ర్మ లుక్ త‌ర్వాతే స‌ల్లూ భాయ్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన  ఈచిత్రం జూలై 6న విడుదల కానుంది


Follow Us