Allu Sirish Movie Teaser


మెగా కాంపౌండ్ నుంచి ఇప్ప‌టికిదే లాస్ట్
స‌మ్మ‌ర్ మొత్తం మెగా హీరోలే క‌నిపించారు. రిజ‌ల్ట్ ఎలా ఉన్నా, రిలీజ్ ల‌లో మాత్రం ప‌క్కా ప్లాన్ చేసుకున్నారు. ఫ‌స్ట్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్, త‌ర్వాత సుప్రీమ్, స‌రైనోడు అంటూ వ‌చ్చారు. నెక్స్ట్ నిహారిక ఒక మ‌న‌సుకి కూడా డేట్ ఖ‌రార‌యింది. కానీ ఈ సినిమాల‌న్నింటికంటే ముందే రిలీజ్ రెడీ అయిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమా గురించి మాత్రం కొన్ని నెల‌లుగా ఏ విష‌యం బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ఈ సినిమా గురించిన సంగ‌తులేవీ తెలియ‌లేదు. అయితే శిరీష్ కూడా త‌మ ఫ్యామిలీ మొత్తాన్ని ఆద‌రించిన ఫ్యాన్స్ త‌న‌ను కూడా అభినందిస్తార‌న్న న‌మ్మ‌కంతో నెక్స్ట్ మూవీ టీజ‌ర్ ను త్వర‌లో విడుద‌ల చేస్తామంటూ కొత్త క‌బురు చెప్పాడు. మ‌రి ఈ మెగాహీరో ఈసారైనా అభిమానుల కోరిక తీరుస్తాడో లేదో చూడాలి.


Follow Us