Allu Arjun: The Summer King


నేనే నెంబ‌ర్ వ‌న్ అంటున్న అల్లు అర్జున్
 
అదేంటో స‌మ్మ‌ర్ అల్లుఅర్జున్ కి బాగానే నీడ‌నిస్తుంది. గతేడాది స‌మ్మ‌ర్ సీజ‌న్ లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బంప‌ర్ బొనాంజా ఖాయ‌మ‌నుకున్నారు. బాహుబలి, శ్రీమంతుడు, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, ల‌య‌న్ వంటి సినిమాల‌తో స‌మ్మ‌ర్ మొత్తం పెద్ద సినిమాలే అనుకున్నారంతా. కానీ బాహుబ‌లి, శ్రీమంతుడు ఎండ‌ల‌ను వ‌ద్ద‌నుకుని బ‌రిలో నుంచి త‌ప్పించుకున్నాయి. పోతే 'ల‌య‌న్' పెద్ద డిజాస్ట‌ర్. యావ‌రేజ్ టాక్ తో మొద‌లై స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమానే స‌మ్మ‌ర్ విన్న‌ర్ గా నిలిచింది. డివైడ్ టాక్ తోనే రూ.50కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి బ‌న్నీ సత్తాను రుజువు చేసింది.
ఈఏడాది స‌రైనోడు తో మ‌ళ్లీ మ్యాజిక్ చేశాడు బ‌న్నీ. ఈ సినిమా కూడా డివైడ్ టాక్ తోనే మొద‌లైంది. కానీ చివ‌రికి బ్లాక్ బస్ట‌ర్ టాక్ తో రూ.70కోట్ల వ‌సూళ్ల‌తో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈసారి కూడా స‌మ్మ‌ర్ విన్న‌ర్ అల్లు అర్జునే. 2014లో స‌మ్మ‌ర్ విన్న‌ర్ కూడా బ‌న్నీనే. అప్పుడొచ్చిన లెజెండ్, మ‌నం కూడా సూప‌ర్ హిట్ అయిన‌ప్ప‌టికీ, రేసుగుర్రం సినిమాకే మంచి వ‌సూళ్లొచ్చాయి. మొత్తానికి వ‌రుస‌గా మూడు స‌మ్మ‌ర్ సీజ‌న్ ల‌లో బ‌న్నీ త‌న ఆధిప‌త్యాన్ని నిరూపించుకుని 'స‌మ్మ‌ర్ కింగ్' అనిపించుకుంటున్నాడు.


Follow Us