Allu Arjun Target On Pawan Again


ప‌వ‌న్ ను మ‌రోసారి టార్గెట్ చేసిన బ‌న్నీ
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన స‌రైనోడు విడుద‌లైన అన్ని ఏరియాల్లో విజ‌య‌ప‌థంలో దూసుకుపోతూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు. సినిమా రిలీజై 40 రోజులైనా బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలోని టాప్ 5 లిస్ట్ లోకి అడుగుపెట్టిన స‌రైనోడు ప‌వ‌న్ రికార్డును టార్గెట్ చేసింది. టాలీవుడ్ లోఎక్కువ మొత్తంలో వ‌సూళ్లు సంపాదించిన చిత్రాల లిస్ట్ లో మొద‌టి రెండు స్థానాల్లో బాహుబ‌లి, శ్రీమంతుడు ఉండ‌గా, మూడ‌వ స్థానంలో అత్తారింటికి దారేది చిత్రం ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన ఈ సినిమాకు 74 కోట్లకుపైగా వసూళ్లు దక్కాయి. ఇప్పుడు బన్నీ నటించిన సరైనోడు ఈ రికార్డుకు చేరువయిందని ట్రేడ్ జనాలు చెబుతున్నారు.


Follow Us