A..aa Movie Review


After two successful hits Nithin came up with Heart attack and disappointed.after a long break again he is coming up with A Aa.  with  Julai, Atharintiki Daredi ,Son of Satyamurthi successful hits trivikram is in full form and now he came up with the movie A Aa.Samantha joined hands with them.with all these  combinations movie has high expectations.lets see how the movie is.

Nadia is very rich.her husband charectis done by Naresh. They both have one and only daughter Samantha.Nadia thinks all the things happening in Samantha life should be in her control.Samantha doesn't like that.one fine day she wants to commit suicide because of her mom. Why she got that much angry on her Mom.How Nithin gets contact to samantha. How they become close is the rest of the story.

This is a pure family story From the pen of the dialogue writer Trivikram.The 1st half of the film goes with some comedy scenes very fast.The movie is based on a village story.every scene is very nice to see on screen.The main story starts in the second half.nearly one hour movie rounds at only one story.Family sentiments are also high in the film.audience feel some bored in those scenes. Everybody cannot connect tho those sentiments if connects then the movie is super.

Going to characters Anasuya Ramalingam alias Samantha,Anand Vihari alias Nithin.Story mainly revolves around samantha charecter.samantha also acted very well in the film.Sentiment,comedy,innocent,angry, etc all emotions are shown in her character. Nithin is very different in this movie as never before.the maturity in the Nithin acting in second half emotional scenes will be appreciated by everyone. Next the key role in the movie played by Anupama parameshwaran.though her debut movie in telugu her performance is superb but when her character enters on screen we all will remember the Aksha character in the Kandireega movie.trivikram designed her character as it is.We need not to talk about Rao ramesh character.he thinks Every film as his 1st film and gave his 100% output.His performance in climax dialogues comedy is awesome.Nadia,Naresh,Samantha acted very vell. Posani,Ajay,Avasarala,Giribabu, praveen,ect all artists done their job perfectly.

As a director such a huge craze he has again he proved his mark.but we misses those punch dialogues which are regular in his movies.he showed some repeated scenes form his previous movies. We remember Atharintiki daredi movie in second half. Nithin sister scenes are also not convincingly done.Each and every frame in the movie was top notch. Micky gave superb music In less time.those songs are also picturised very well onscreen. production values are top notch.

Finally go and watch the movie without any high expectations.then you will enjoy the movie. Dont expect Trivikram kind of punch dialogues in this movie you may get  disappointed.

వ‌రుస‌గా రెండు విజ‌యాల త‌ర్వాత ప్రేక్ష‌కుల‌ను మెప్పిద్దామ‌ని హార్ట్ ఎటాక్ తో వ‌చ్చి ఇబ్బంది ప‌డ్డ నితిన్ చాలా గ్యాప్ త‌ర్వాత చేసిన సినిమా., జులాయి, అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ సత్య‌మూర్తి తో డైర‌క్ట‌ర్ గా త‌న మార్క్ ని చూపుతున్న త్రివిక్ర‌మ్ అంద‌రికీ ఓన‌మాలును గుర్తు చేయాల‌న్న ఆంక్ష‌తో అ..ఆ ను ముస్తాబు చేశాడు. టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతున్న స‌మంత వీరికి తోడైంది. అసంఖ్యాక అభిమానులు ఆదరించే న‌టీన‌టులు, డైర‌క్ట‌ర్. వీరి కాంబినేష‌న్ లో ఒక సినిమా వ‌స్తుందంటే దానిపై అంచ‌నాలు ఎలా ఉంటాయ‌నేది ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంద‌రికీ మ‌ళ్లీ అక్ష‌రాలు దిద్దుకోవ‌డం ద‌గ్గర్నుంచి జీవితం మొద‌లు పెట్టాల‌నింపించేలా చేయాల‌నుకున్న త్రివిక్ర‌మ్ ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకోవాలి. అయితే ప్రయత్నం మంచిదో, చెడ్డదో పక్కన పెడితే అంతిమంగా అది ఎంత మందిని మెప్పించింది, ఎంత మేరకు రాణించింది అనేదే కౌంట్‌ అవుతుంది.
కోటీశ్వ‌రురాలు న‌దియా. ఇంట్లో చ‌లామ‌ణి మొత్తం ఆమెదే. త‌న భ‌ర్త న‌రేష్. వీళ్ల‌కు ఒక్క‌గానొక్క కూతురు స‌మంత‌. స‌మంత జీవితంలో జ‌రిగే ప్ర‌తి విష‌యం త‌న కంట్రోల్ లోనే ఉండాల‌ని అనుకుంటుంది న‌దియా. ఆ విష‌యం స‌మంత కు న‌చ్చ‌దు. త‌ల్లి మీద కోపంతో ఒక విష‌యంలో స‌మంత సూసైడ్ చేసుకోబోతుంది. అస‌లు స‌మంతకు త‌ల్లి మీద అంత కోపం వ‌చ్చే ప‌ని న‌దియా ఏం చేసుంటుంది. స‌మంత‌ను నితిన్ ఎలా ప‌రిచ‌య‌మ‌వుతాడు, చివ‌రికి ఎలా ఒక‌ట‌వుతారు అన్న‌దే మిగ‌తా క‌థ‌.
ఎప్ప‌టిక‌ప్పుడు మూలాల్ని వెదుక్కోవాలన్న ప్ర‌య‌త్నం గురించి త‌ప్ప‌కుండా మాట్లాడుకోవాలి. ప‌క్క‌ప‌క్క‌నే ఉన్న అక్ష‌రాలు ప‌రిచ‌యం కావ‌డానికి పాతికేళ్లు ప‌ట్టింది అంటూ టీజ‌ర్ తోనే అద్భుతాన్ని చెప్పిన త్రివిక్ర‌మ్, ట్రైల‌ర్ తో ఇద్ద‌రి గురించి క‌థ చెప్పాలంటే మూడు భాగాల్లో చెప్పాల‌ని మ‌రోసారి త‌న మార్క్ ను చూపించాడు త్రివిక్ర‌మ్.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జారిపడిన ఓ చక్కటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని చెప్పొచ్చు. సినిమా ఫ‌స్ట్ హాఫ్ అంతా స‌ర‌దాగా చ‌కాచ‌కా సాగిపోతుంది. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో జ‌రిగే ప్ర‌తి సీన్ చూడ‌ముచ్చ‌ట‌గా అందంగా, ఆహ్లాద‌కరంగా ఉంటుంది. సెకండాఫ్ లోనే సినిమా అస‌లు క‌థ‌లోకి ప్ర‌వేశిస్తుంది. ఒక గంట పాటు మొత్తం ఒకే క‌థ చుట్టూ న‌డుస్తూ ఉంటుంది. దీనికి తోడు ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా కొంచెం ఎక్కువ‌గానే అనిపిస్తాయి.సెకండాఫ్ లో ఎక్కువ సెంటిమెంట్స్ కే ప్రాధాన్య‌త‌నిచ్చాడు ద‌ర్శ‌కుడు. అందుకే చూసే ప్రేక్ష‌కుడికి అబ్బా ఎందుకు ఇంత సాగ‌దీత అనిపిస్తుంది. ఆ ఎమోష‌నల్ సీన్స్ కి అంద‌రూ క‌నెక్ట్ అవ‌లేరు, కనెక్ట్ అయితే మాత్రం సినిమా సూప‌రే.
ఇక క్యారెక్ట‌ర్స్ గురించి మాట్లాడుకుంటే అదే అనసూయ రామ‌లింగం ఎలియాస్ స‌మంత‌, ఆనంద్ విహార్ ఎలియాస్ నితిన్. హీరో నితిన్ అయినా సినిమా మొత్తం ఎక్కువ‌గా స‌మంత క్యారెక్ట‌ర్ చుట్టూనే తిరుగుతుంది. దానికి త‌గ్గ‌ట్టు త‌న పాత్ర‌లో స‌మంత బాగా ఒదిగిపోయింది. సెంటిమెంట్, కామెడీ, అమాయకత్వం, పొగరు ఇలా అన్ని రకాల వేరియేషన్స్ తో పాటు త‌న గ్లామ‌ర్ తో న‌టించింది అనేకంటే జీవించింది అని చెప్పొచ్చు. ఒకానొక ద‌శ‌లో స‌మంత త‌ప్ప ఇలా ఇన్ని వేరియేష‌న్స్ ఎవ‌రూ చేయ‌లేనంత బాగా చేసింది. నితిన్ ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సినిమాలన్నింటికంటే ఇందులో చాలా డిఫ‌రెంట్ గా, త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వ‌చ్చే సెంటిమెంట్ సీన్స్ లో నితిన్ లోని యాక్టింగ్ మెచ్యురిటీని, నితిన్ రేంజ్ ని చూపించాయి. పోతే ఈ సినిమాలో చెప్పుకోద‌గ్గ వాళ్ల‌లో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్ మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. తొలిసారిగా తెలుగు తెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప‌ల్లెటూరి అమ్మాయిగా బాగా చేసింద‌నే చెప్పాలి కానీ ఈ సినిమాలోఅనుప‌మ క్యారెక్ట‌ర్ చూసిన‌ప్పుడ‌ల్లా కందిరీగ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ అందులో అక్ష క్యారెక్ట‌ర్ గుర్తుకువ‌స్తుంది. సేమ్ అనుప‌మ్ క్యారెక్ట‌ర్ ని అలాగే డిజైన్ చేశాడు త్రివిక్ర‌మ్. రావు ర‌మేష్ న‌ట‌న గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏ సినిమాకి ఆ సినిమానే త‌న కొత్త సినిమాలాగా ఫీల్ అయి, త‌న పాత్ర‌కు 100% న్యాయం చేస్తూ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నాడు. క్లైమాక్స్ లో రావు ర‌మేష్ డైలాగ్స్, కామెడీ సీన్స్ అయితే అదుర్స్ అంతే. న‌దియా, న‌రేష్ స‌మంత తల్లిదండ్రులుగా కోటీశ్వ‌రులుగా బాగా చేశారు. పోసాని, అజ‌య్, అవ‌స‌రాల,గిరిబాబు,ప్ర‌వీణ్ మిగ‌తా న‌టీన‌టులు త‌మ త‌మ పాత్ర‌ల వ‌ర‌కు బాగా చేశారు.
డైర‌క్ట‌ర్ గా ఎంతో క్రేజ్ ఉన్న త్రివిక్ర‌మ్ మ‌రోసారి త‌న మార్క్ చూపించాడు. మంచి ఎమోష‌న్స్ ను త‌న మాట‌ల‌తో సున్నితంగా తెర‌కెక్కించాడు. కానీ రెగ్యుల‌ర్ గా త్రివిక్ర‌మ్ నుంచి వ‌చ్చే పంచ్ డైలాగ్ లు మాత్రం సినిమాలో మిస్ అయ్యాయి. త‌న పాత సినిమాల్లో రెగ్యుల‌ర్ గా క‌నిపించే సీన్స్, ఎమోష‌న్స్ ని మరోసారి తెర‌మీద చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ సినిమా సెకండాఫ్ లో స్టోరీ రివీల్ అయిన వెంట‌నే ఈ సినిమా అత్తారింటికి దారేది సినిమాని ఇన్స్‌పిరేష‌న్ గా తీసుకుని చేశారా అనిపిస్తుంది. అలాగే నితిన్ చెల్లి సీన్స్ లో కూడా క‌న్విన్సింగ్ గా అనిపించ‌దు. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణాన్ని అందాల‌ను ఎంతో అద్భుతంగా తీర్చి దిద్ద‌డంలో సుబ్ర‌మ‌ణ్యం స‌క్సెస్ అయ్యాడు. అలాగే సినిమాలోని ప్ర‌తి ఫ్రేమ్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉండేలా సినిమాటోగ్ర‌ఫీని ఎలివేట్ చేశాడు. త‌క్కువ కాలంలోనే మంచి మ్యూజిక్ డైర‌క్ట‌ర్ గా నిల‌బ‌డ్డ మిక్కే జే మేయ‌ర్ మ‌రోసారి త‌న మ్యూజిక్ తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ఆడియో ప‌రంగా విన‌డానికి బాగున్న సాంగ్స్, స్క్రీన్ మీద ఇంకా అద్భుతంగా పిక్చ‌రైజ్ చేశారు. హారిక, హాసిని వారి నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.
మొత్తానికి అ..ఆ సినిమా ప్ర‌మోష‌న్స్ లో చెప్పినది విని హై ఎక్స్‌పెక్టేష‌న్స్ తో వెళ్ల‌కుండా మామూలుగా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాల‌నుకున్న‌వాళ్లు వెళ్తే, చ‌క్క‌గా ఎంజాయ్ చేయొచ్చు. త్రివిక్ర‌మ్ నుంచి పంచ్ డైలాగులు ఇవ‌న్నీ ఆశించి వెళ్తే మాత్రం నిరాశే మిగులుతుంది.

పంచ్‌లైన్: అ..ఆ., అదిరింది.. ఆడుతుంది

 
Filmjalsa Rating : 3.5/5
 
Thank You For Reading
 


Follow Us