Soggade Chinni Nayana Remake In Kannada


క‌న్న‌డ‌లోకి నాగార్జున సూప‌ర్‌హిట్ సినిమా రీమేక్
ఒక‌ప్పుడు చిరంజీవి, వెంక‌టేశ్, బాల‌కృష్ణ తో పోటీప‌డి, ఇప్పుడు మ‌ళ్లీ యంగ్ హీరోల‌తో పోటీ ప‌డ‌టం ఒక్క నాగార్జునకే చెల్లింది. ఎప్పటిక‌ప్పుడు ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలుస్తూ, త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడు. కేవ‌లం తెలుగు లోనే కాదు దేశ, విదేశాల్లో త‌న‌కంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు నాగార్జున. 
మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి సినిమాల‌తో కేవ‌లం టాలీవుడ్ లోనే కాకుండా, ఓవ‌ర్సీస్ లోనూ కలెక్ష‌న్ల వ‌ర్షం కురిపించాడు ఈ మ‌న్మ‌థుడు. ముఖ్యంగా సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రం గురించి చెప్పుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు నాగార్జున న‌టించిన సూప‌ర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయ‌నా క‌న్న‌డ‌లో రీమేక్ కానుంది.
తెలుగు వారికి సుప‌రిచితుడైన క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. తెలుగులో నాగార్జున చేసిన రెండు పాత్రలను ఉపేంద్ర పోషించడమే కాకుండా, దీనికి దర్శకత్వం కూడా ఆయనే వహించనున్నాడు. అలాగే తెలుగులో రమ్యకృష్ణ పోషించిన పాత్రను నిన్నటితరం కథానాయిక ప్రేమ చేయనుంది. ఉపేంద్ర, ప్రేమ కలసి సుమారు పదిహేడేళ్ల తర్వాత మళ్లీ జంటగా ఈ చిత్రంలో న‌టించ‌నున్నారు. ప్రస్తుతం ఉపేంద్ర ఈ చిత్రం స్క్రిప్టు పనిలో బిజీగా వున్నట్టు, జూలై నుంచి షూటింగ్ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.


Follow Us