నాయుడు కు థాంక్స్ చెప్పిన శ్రుతి


మామూలుగా బయట వారికైతే ఈ ప్రాజెక్టులోకి  తీసుకున్నందుకు థ్యాంక్యూ థ్యాంక్యూ అంటూ ఎన్నిసారులైనా చెప్పొచ్చు. కాని సొంత ఫ్యామిలీకి కూడా చెప్పాలంటారా ఈ కృతజ్ఞతలు? కానీ మన నాయుడు గారి పిల్ల మాత్రం చెప్పేస్తోంది.ఇంత‌కీ ఎవ‌రు ఎవ‌రికి థ్యాంక్స్ చెప్పారా అంటారా.. మీరే చదివేయండి. ''శభాష్ నాయుడు'' అంటూ ఒకేసారి తెలుగ - తమిళ - కన్నడ బాషల్లో లెజండరీ కమల్ హాసన్ రూపొందిస్తున్న సినిమాలో కమల్ కూతురిగా.. అదేనండీ నాయుడు గారి పిల్లగా ఏకంగాత‌న గారాల‌ప‌ట్టి శృతి హాసన్ నటిస్తోంది. కమల్ తో కలసి చిన్నప్పుడు హే రామ్ అనే సినిమాలో నటించిన ఈ సన్నజాజి.. పెద్దయ్యాక ఒక్కసారి కూడా ఎప్పుడూ ఆయన సినిమాల్లో మెరవలేదు. ఇప్పుడు మాత్రం ఏకంగా తండ్రీ కూతుళ్లిద్దరూ కలసి లీడ్ రోల్ లో న‌టించ‌నున్నార‌ట‌. నాయుడు గారు ఎలాగో  మార్కులు కొట్టేస్తారు.. మరి ఆయన ప్రక్కన శృతి ఏ రేంజ్ లో ఉంటుందో తెర‌పైనే చూడాలి. డాడ్ అండ్ డాటర్ కలసి నటించిన సినిమాలు చాలా అరుదుగానే వస్తున్నాయి. తెలుగులో అయితే  మోహన్ బాబు అండ్ మంచు ల‌క్ష్మి.. అలాగే నాగబాబు అండ్ నిహారిక.. ఇలా కొంతమందిని మ‌నం చూసే ఛాన్సుంది. కాని లీడ్ రోల్స్ లో వీరెవ్వరూ ఇంకా ఏమీ ప్రయత్నించలేదు.


Follow Us