కొణిదెల ప్రొడక్షన్స్ మెగా ఫ్యామిలీ కి కలిసోస్తుందా ...


తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు తమకంటూ ఒక బ్యానర్ ని స్థాపించుకుని తమ వంశోద్దారకులను పరిచయం చేసుకుంటూ అడపాదడపా చిన్న సినిమాలకు ప్రాధాన్యమిస్తూ తమకంటూ ఒక స్ట్రేచర్ ని క్రియేట్ చేసుకుంటున్నారు.  ఈ విభాగంలో కొన్ని ప్రొడ‌క్ష‌న్స్ మంచి  విజ‌యాలు సాధించ‌గా.. మ‌రికొంత‌మందికి ఓన్ ప్రొడ‌క్షన్స్ కలిసిరావ‌డం లేదు. అన్న‌పూర్ణ స్టూడియోస్, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్.. త‌మ వారసుల‌తో తీసిన సినిమాలు దాదాపుగా హిట్ అయిన‌వే..  వాటితో పోటి పడదగ్గ మెగా ప్రొడక్షన్ హౌస్ లు మాత్రం ఈ మధ్య కాస్త వెనకడుగు వేస్తున్నాయి . ముఖ్యంగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కి , అల్లు అర్జున్ సినిమాలకు దోస్తీ కుదరడంలేదు. హ్యాపీ - బద్రినాధ్ సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. సరైనోడు పర్వాలేదనిపించినా అనుకున్న లాభాలు రాకపోవచ్చు. చిరు - నాగబాబుల అంజనా ప్రొడక్షన్స్ పరిస్థితి కూడా అలానే వుంది. స్టాలిన్, ఆరెంజ్ వంటి పరాజయాలతో సొంత హీరోలకు  అందించడంలో విఫలమయ్యింది. ఈ క్రమంలో కొణిదెల క్రియేషన్స్ బ్యానర్ పై చిరు నటించనున్న 150వ సినిమాని చెర్రీ నిర్మిస్తుండడంతో అందరి దృష్టి దానిపైకే మ‌ళ్లింది.


Follow Us