‘మెర్య్కూరీ’ మూవీ రివ్యూ

0
170

త‌మిళ్ యంగ్ డైర‌క్టర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం చేసిన సైలెంట్ థ్రిల్ల‌ర్ మెర్య్కూరీ. అస‌లేమీ సంభాష‌ణ‌లే లేకుండా తెర‌కెక్కిన ఈ సినిమా మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో మ‌న స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థః
ఒక పెద్ద పార్టీ చేసుకుని కారులో బ‌య‌టికెళ్లిన ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ప్ర‌మాద‌వ‌శాత్తూ ఒక వ్య‌క్తి(ప్ర‌భుదేవా)ని కారుతో గుద్దేసి, ఆ వ్య‌క్తిని ఫ్యాక్ట‌రీలో తీసుకెళ్లి ప‌డేస్తారు.వారి వ‌ల‌న బాధ‌కు గురైన ప్ర‌భుదేవా ఆ ప్ర‌మాదం త‌ర్వాత ఏమ‌య్యాడు, వారి మీద ప‌గ‌ను ఎలా తీర్చుకున్నాడు? అస‌లు ప్రభుదేవా క‌థేంటి..? ఆ న‌లుగురు ఫ్రెండ్స్ ఎవ‌రు అన్న‌దే సినిమా.

న‌టీన‌టుల ప్ర‌తిభః
న‌టుడిగా ప్ర‌భుదేవా ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఒక్క ప్ర‌భుదేవా మాత్ర‌మే కాదు, సినిమాలోని ప్ర‌తీ క్యారెక్ట‌ర్ ను ద‌ర్శ‌కుడు మ‌లిచిన విధానం కానీ, వారి నుంచి మంచి న‌ట‌న రాబ‌ట్టుకోవ‌డం కానీ అంతా బావుండ‌టంతో ఈ క్యారెక్ట‌ర్లో చేసిన‌ వారు బాగా చేశారు, ఈ క్యారెక్ట‌ర్ లో చేసిన వారు బాగా చేయ‌లేదు అని లేకుండా అంద‌రూ త‌మ త‌మ ప‌రిధుల్లో బాగా న‌టించి, మెప్పించారు.

సాంకేతిక నిపుణులుః
ప్ర‌భుదేవా లాంటి న‌టుడిని పెట్టుకుని ఇలాంటి సైలెంట్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సినిమా తీయాల‌నుకున్న కార్తీక్ సుబ్బ‌రాజు ను అభినందించాల్సిందే. దీనికోసం తను ప‌డిన క‌ష్టం స్క్రీన్ మీద బాగా అర్థ‌మ‌వుతుంది. ప్ర‌తీ క్యారెక్ట‌ర్ ను త‌ను మ‌లిచిన విధానం, వారి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఇది సైలెంట్ సినిమా అన్న విష‌యాన్ని మ‌న‌కు గుర్తు రానీయ‌కుండా చేస్తుంది. అయితే ఇలాంటి స‌న్నివేశాలు మాత్ర‌మే ప్రేక్ష‌కుడిని 2 గంట‌ల‌పాటూ థియేట‌ర్లో కూర్చోపెట్టాలి అంటే క‌ష్ట‌మే. దానికి స‌రైన క‌థ‌, క‌థ‌నం జోడించి ఉంటే మెర్య్కూరీ స్థాయి మ‌రోలా ఉండేది. సినిమా మొత్తాన్నిఫ్యాక్టరీ బ్యాక్ డ్రాప్‌లో సెట్ చేసిన విధానం, బాగుంది. లొకేష‌న్లు మెప్పిస్తాయి. సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. సంతోష్ నార‌య‌ణ‌న్ రీరికార్డింగ్ ఇంప్రెసింగ్ గా ఉంది. వివేక్ హ‌ర్ష‌న్ ఎడిటింగ్ బావుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి తగ్గ‌ట్లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
ప్ర‌భుదేవా
రీరికార్డింగ్

మైన‌స్ పాయింట్స్ః
క‌థ‌ను చెప్ప‌లేక‌పోవ‌డం

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here