ట్రైల‌ర్ టాక్ః ల‌క్ష్మీ’స్ ఎన్టీఆర్ – తెలిసిన క‌థ‌లో తెలియ‌ని క‌థ‌నం

0
1986
సినిమా ఏదైనా స‌రే.. త‌ను టేక‌ప్ చేసాడంటే అది సంచ‌ల‌న‌మే.. ప్ర‌తీ సినిమా టైటిల్ తోనే హాట్ టాపిక్ అయ్యేలా సెట్ చేస్తాడు ఆర్జీవీ. ఇప్పుడు త‌ను తెర‌కెక్కించిన ఇంకో సినిమా ల‌క్ష్మీ’స్ ఎన్టీఆర్ కూడా అదే కోవ‌లో ఉంది. ఇప్ప‌టికే ప్ర‌జ‌లంద‌రికీ మ‌హ‌నీయుడైన ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఎన్టీఆర్ క‌థానాయకుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు పేరుతో సినిమాలొచ్చిన‌ప్ప‌టికీ, వాటిలో ప్రేక్ష‌కుల‌కు పాజిటివ్స్ మాత్ర‌మే చూపిస్తే ఎలా అని ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరుతో అస‌లు ఎన్టీఆర్ జీవితంలో అంద‌రికీ తెలియ‌ని క‌థ‌ను చూపించ‌బోతున్నానంటూ.. కుటుంబ కుట్రల చిత్ర‌మ‌ని మొద‌టి నుంచి చెప్పుకుంటూ వ‌స్తున్నాడు. రోజుకో పోస్ట‌ర్ తో హాట్ టాపిక్ గా మారుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ కొద్ది సేప‌టి క్రిత‌మే విడుదలైంది.

ట్రైల‌ర్ మొద‌ట్లోనే న‌మ్మితేనే క‌దా మోసం చేసేది అని ఎన్టీఆర్ అడ‌వి రాముడు చిత్రంలోని డైలాగ్ ను తీసుకుని దాన్ని త‌న క‌థ‌కు అనుగుణంగా మార్చుకున్నాడు ఆర్జీవీ. అసలు ల‌క్ష్మీ పార్వ‌తి అనే ఆవిడ ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వ‌చ్చింది? ఆమెను ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవ‌డానికి కార‌ణాలేంటి?  ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఓడిపోయిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలేంటి? త‌న కుటుంబంలో వ‌చ్చిన క‌ల‌హాలు.. ఇలా ఒక‌టేంటి ఈ సినిమాతో చాలానే చెప్ప‌నున్నాడన్న విష‌యం ట్రైల‌ర్ తోనే అర్థ‌మ‌వుతుంది. అంతేకాదు చివ‌ర్లో నేను నా జీవితంలో చేసిన పెద్ద త‌ప్పు ఏదైనా ఉంది అంటే అది వాడిని న‌మ్మ‌డ‌మే అంటూ ఎన్టీఆర్ చంద్ర‌బాబు ను ఉద్ధేశించి చెప్పిన డైలాగ్ అయితే ఎన్ని సంచనాల‌కు దారి తీస్తుందో అనేలా ఉంది. మొత్తానికి ట్రైల‌ర్ తోనే ర‌చ్చ చేస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్.. ఇక సినిమాతో ఎంత‌టి వివాదాల‌కు దారి తీస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here