‘కాంచన-3’ మూవీ రివ్యూ

0
559
ప్రేక్ష‌కుల‌ను ఓ వైపు భ‌య‌పెడుతూనే మ‌రోవైపు న‌వ్విస్తూ ముని, కాంచ‌న సిరీస్ లు ఎంత‌గా పాపుల‌ర్ అయ్యాయో తెలియంది కాదు. కారణం లేకుండా స్వార్థ ప‌రుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎవ‌రో ఒక‌రి శ‌రీరంలోకి వ‌చ్చి ప్రేతాత్మ‌లుగా మారి ప‌గ తీర్చుకోవ‌డం దీని ప్ర‌ధాన థీమ్. ముని నుంచి మొన్న వ‌చ్చిన గంగ వ‌ర‌కు అన్నింటిలోనూ లారెన్స్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు మ‌రోసారి అదే ఫార్ములాతో కాంచ‌న-3 గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి గ‌త సినిమాల లాగానే ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోగ‌లిగిందా లేదా అన్న‌ది సమీక్ష‌లో చూద్దాం.

కాళీ (లారెన్స్) త‌ల్లి రాధ‌మ్మ అనాథాశ్ర‌మాన్ని న‌డుపుతూంటుంది. తోటి వారి క‌డుపు నింపితే ఆ భ‌గ‌వంతుడు మ‌న క‌డుపు నింపుతాడ‌ని బ‌లంగా న‌మ్మే ఆమె ఆ ఆశ్ర‌మంలోనే కొడుకు కాళీతో పాటూ రోజీ అనే ఇంగ్లీష్ పిల్ల‌ను కూడా పెంచుతూ ఉంటుంది. త‌ల్లి రాధ‌మ్మ హఠాత్తుగా చ‌నిపోవ‌డంతో చిన్న వ‌య‌సులోనే అమ్మ బాధ్య‌త‌ల‌ను తీసుకుంటాడు కాళీ. ఆ స‌మయంలో అత‌డికి రోజీ అండ‌గా నిలుస్తుంది. కాళీ పెద్ద‌య్యాక అనుకోని కార‌ణాల వ‌ల్ల మినిస్ట‌ర్ త‌మ్ముడు తో గొడ‌వ‌కు దిగాల్సి వ‌స్తుంది. త‌న ఇగో హ‌ర్ట్ చేసిన కాళీ పై ప‌గ పెంచుకున్న భ‌వానీ కాళీ మ‌నిషి ని చంపిస్తాడు.అది భ‌రించ‌లేక కాళీ హత్య చేసిన వారినీ, భ‌వానీని చంపేస్తాడు. త‌మ్ముడిని చంపేసిన కాళీపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి మినిస్ట‌ర్ కాళీ న‌డిపిస్తున్న ట్ర‌స్ట్ ను త‌గ‌ల‌బెట్టించి కాళీని, రోజీని కూడా చంపేసి యాక్సిడెంట్ గా క్రియేట్ చేస్తాడు. చ‌నిపోయిన వారు ఆత్మ‌లుగా మారి ఎలా రాఘ‌వ శ‌రీరంలోకి ప్ర‌వేశించార‌న్న‌ది మిగిలిన క‌థ‌.

ఎప్ప‌టిలాగానే దెయ్యాలంటే భ‌య‌ప‌డే యువ‌కుడి పాత్ర‌లో రాఘ‌వ లారెన్స్ ఒదిగిపోయాడు. త‌ల్లి పాత్ల‌రో కోవై స‌ర‌ళ‌, వ‌దిన‌గా దేవ‌ద‌ర్శిని బాగానే చేశారు. కాళీ, రాఘ‌వ క్యారెక్ట‌ర్స్ లో రెండూ షేడ్స్ లోనూ లారెన్స్ మంచి న‌ట‌న క‌న‌బ‌రిచాడు. మిగిలిన వారిలో ఓవియా, వేదిక‌, నిక్కీ, తదిత‌రులు వారి వారి ప‌రిధుల్లో బాగానే చేశారు.

లారెన్స్ ద‌ర్శ‌కత్వం బానే ఉంది కానీ అత‌ను యాక్ష‌న్ సన్నివేశాల మీద పెట్టిన శ్ర‌ద్ధ హర్ర‌ర్ సీన్స్ పై పెట్టుంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. ముందు సినిమాల మాదిరిగానే ఉండ‌టం వ‌ల్ల కాంచ‌న‌-3 కొత్త‌గా కాకుండా కాస్త రొటీన్ గా అనిపిస్తుంది. లారెన్స్ ఫాలో అయ్యే సిరీస్ ఫార్ములా కొంచెం మార్పులు చేసుంటే బావుండు అనిపిస్తుంది.  కాళీ పాత్ర ఎంత మంచి ప‌నులు చేసిన‌ప్ప‌టికీ, ఆ పాత్ర‌కు మ‌రీ ఆ రేంజ్ బిల్డ‌ప్ అవ‌స‌రం లేద‌నిపిస్తుంది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ మెప్పిస్తాయి. సెకండాఫ్ లో వ‌చ్చే ఒక కామెడీ ట్రాక్ సినిమాకు హైలైట్ గా చెప్పొచ్చు. ఎప్ప‌టిలాగానే ఈసారి కూడా దెయ్యం దేవుడి హెల్ప్ తోనే త‌న ప‌గ‌ను తీర్చుకోవ‌డం కూడా పాత ఫార్ములానే.  సినిమాటోగ్ర‌ఫీ బావుంది. పాట‌లేమీ బాలేవు. థ‌మ‌న్ రీరికార్డింగ్ మాత్రం బావుంది. ఎడిటర్ త‌న క‌త్తెర‌కు మరింత ప‌దును పెట్టుండాల్సింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
లారెన్స్ న‌ట‌న‌
మాస్ సీన్స్
హార్ట్ ట‌చింగ్ సీన్స్
కామెడీ
మైన‌స్ పాయింట్స్ః
పాట‌లు
త‌మిళ వాస‌న‌లు
ర‌న్ టైమ్
పంచ్‌లైన్ః కాంచ‌న -3 ముందు లానే..!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3 5