‘జంబ‌ల‌కిడి పంబ’ మూవీ రివ్యూ

0
232

 

జంబ‌లకిడి పంబ. ఈవీవీ స‌త్య‌నారాయణ తీసిన సినిమాల్లో మంచి క్లాసిక్ కామెడీగా పేరు తెచ్చుకున్న సినిమా. ఆ సినిమా పేరుతోనే ఇప్పుడు శ్రీనివాస రెడ్డి మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి రెడీ అయ్యాడు. మ‌రి ఆ సినిమా సాధించిన పేరు ప్ర‌ఖ్యాత‌ల్ని ఈ సినిమా సాధించిందా లేదా చూద్దాం.
క‌థః 
భార్యాభ‌ర్త‌లైన వరుణ్ (శ్రీనివాస రెడ్డి), ప‌ల్ల‌వి(సిద్ధి ఇద్నానీ) భార్యాభ‌ర్త‌లు. కానీ ఇద్ద‌రికీ ఒక్క‌క్ష‌ణం కూడా ప‌డ‌దు. ఎప్పుడు చూసినా గొడ‌వ ప‌డుతూనే ఉండే వారు లాభం లేద‌ని విడాకులు తీసుకోవాల‌నుకుంటారు. వాళ్ల‌కు విడాకులు ఇప్పించాల్సిన లాయ‌ర్ యాక్సిడెంట్లో చ‌నిపోతాడు. అత‌ను ఆత్మగా మారి వ‌రుణ్, ప‌ల్ల‌విల‌ను క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తాడు. కానీ వ‌రుణ్, ప‌ల్ల‌విలు విన‌రు. దీంతో లాయ‌ర్ వీళ్ల‌ద్ద‌రితో ఆట ఆడ‌తాడు. ఆ ఆటేంటి?  ఆ ఆట వ‌ల్ల వీళ్ల జీవితాలు ఎలా మ‌లుపు తిరిగాయి? అస‌లు ఆ లాయ‌ర్ ఎందుకు వీళ్ల‌ను క‌ల‌పాల‌నుకుంటాడు? అన్నదే క‌థ‌.
న‌టీన‌టుల ప్ర‌తిభః 
అమ్మాయి ల‌క్ష‌ణాల‌తో శ్రీనివాస‌రెడ్డి ప‌డిన క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది.  అబ్బాయి ల‌క్ష‌ణాల‌తో  న‌టించిన సిద్ధి న‌ట‌న ఫ‌స్టాఫ్ లో సోసో గా ఉన్నా, సెకండాఫ్ లో బాగుంటుంది. సినిమాలో చెప్పుకోద‌గ్గ పాత్ర ఎవ‌రైనా ఉన్నారా అంటే వెన్నెల కిషోరే. ప్ర‌తి సినిమాలో త‌న పాత్ర‌కంటూ ఒక ప్ర‌త్యేకత ఉండేలా చూసుకునే వెన్నెల కిషోర్ ఈ సినిమాలోనూ త‌న డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్, మ్యాన‌రిజ‌మ్స్ తో న‌వ్విస్తాడు. స‌త్యం రాజేష్ న‌ట‌న నేచుర‌ల్ గా ఉంటుంంది. హ‌రితేజ క్యారెక్ట‌రైజేష‌న్ బావుంది. పోసాని, ర‌ఘుబాబు మిగిలిన వారు త‌మ త‌మ పాత్ర‌ల మేర ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.
సాంకేతిక నిపుణులుః 
ఏదైనా ఒక విజ‌యం సాధించిన దాన్ని ఆద‌ర్శంగా తీసుకున్నామ‌ని చెప్పాల‌న్నా, ఆ పేరు పెట్టాల‌న్నా చాలా ఆలోచించాలి. అదేమంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఆ సినిమాకు సంబంధించిన పేరు, ప్ర‌ఖ్యాతల్ని చెడ‌గొడ్డ‌కుండా, ఆ సినిమా స్థాయిని మినిమం అందుకునే రేంజ్ క‌థ‌, క‌థ‌నం మ‌న ద‌గ్గ‌రున్న‌ప్పుడే అలాంటి క్లాసిక్స్ జోలికి వెళ్లాలి. స‌రే ఎలాగో పేరు పెట్టాం క‌దా అని లైట్ తీసుకుంటే లైట్ తీసుకున్న‌ట్లే ఉంటుంది వ్య‌వ‌హారం. ఎంతో బాధ్య‌త‌తో, ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని, క‌థ మీద దృష్టి పెట్టి తెర‌కెక్కించాలి, లేదా ఒక మూలన కూర్చోవాలి. అంతే కానీ ఏదో తీశాం అంటే తీశాం అన్న‌ట్లు తీస్తే ఈ సినిమాలాగే ఉంటుంది. ఆ సినిమాతో పోలిస్తే ప‌దోవంతు న‌వ్వులు కూడా ఈ సినిమాలో పండ‌లేదు. పైగా ప్ర‌తీదీ సినిమాటిక్ గా అనిపిస్తుంది కానీ ఎక్క‌డా స‌హ‌జంగా ఉండ‌దు. ఒక మంచి కాన్సెప్ట్ ని వాడుకునే ప్ర‌య‌త్నం ఎక్క‌డా చేయ‌లేదు ద‌ర్శ‌కుడు. రాసుకున్న ప్ర‌తీ సీన్ తేలిపోయింది. సునీల్ ముత్యాల సినిమాటోగ్ర‌ఫీ ఓకే. త‌న మ్యూజిక్ తో ప్రేమ‌క‌థ‌ల‌కు  మంచి సోల్‌ఫుల్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే గోపీ సుంద‌ర్ కూడా ఈ సినిమాకు ఏం చేయ‌లేక‌పోయాడు. పాట‌లేవీ కొత్త‌గా అనిపింవు. రీరికార్డింగ్ కూడా సో సో గా ఉంటుంది. ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌దును పెట్టాల్సింది. నిర్మాణ విలువ‌లు బాగానే ఉన్నాయి.
ప్ల‌స్ పాయింట్స్ః 
వెన్నెల కిషోర్ కామెడీ
మైన‌స్ పాయింట్స్ః 
స‌రైన క‌థ‌నం లేక‌పోవ‌డం
సంగీతం

పంచ్‌లైన్ః జంబ‌ల‌కిడి పంబ – అంచ‌నాలన్నీ రివర్స్ అయ్యాయి!

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here