విజయ్ దేవరకొండ వద్దన్న కథ ఇదేనా..?

0
353
కొన్నిసార్లు ఒక హీరో నిర్ణయం మరో హీరోకు కలిసొస్తుంది. మరికొన్నిసార్లు ఆ హీరోకే కలిసొస్తుంది. మరి ఇందులో ఏది కలిసొస్తుందో కానీ.. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ న్యూస్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ కోసం చాలామంది కర్చీఫ్ లు వేశారు. కథలు వినిపించారు. అలా వినిపించాలనుకున్న దర్శకుల్లో పూరీ జగన్నాథ్ కూడా ఉన్నాడు. ఆ మధ్య అతను పూరీ జగన్నాథ్ తో సినిమా చేస్తున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అదేం లేదని ఖండించారు తర్వాత. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు విజయ్. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగ్ కాకినాడలో జరిగింది కదా. ఆ టైమ్ లో కాకినాడ వెళ్లి మరీ పూరీ జగన్నాథ్ ఓ కథ నెరేట్ చేశాడట. కానీ ఆ కథ విజయ్ దేవరకొండకు నచ్చలేదు. ఒకవేళ చిన్నచిన్న మార్పులు చెప్పినా.. ఇప్పుడు తన రేంజ్ కు సరిపోదని ఖచ్చితంగా చెప్పాడట. మరో మంచి కథ ఉంటే తప్పకుండా చేస్తా అని హామీ కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన స్టోరీతోనే ఇప్పుడు పూరీ జగన్నాథ్ , రామ్ తో సినిమా చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అంటే రీసెంట్ గా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అంటూ విడుదల చేసి కాస్త హడావిడీ చేశారు కదా… ‘ఇస్మార్ట్ శంకర్’’ అని. అదేనన్నమాట. నిజానికి ఈ టైటిల్ విజయ్ దేవరకొండకు కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. కానీ కథ కూడా కుదరాలి కదా. పైగా సినిమాలో హీరో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడతాడని ఆల్రెడీ తెలిసిపోయింది. విజయ్ కి అది కొట్టిన పిండి. రామ్ అంటే నేర్చుకుని చెప్పాలి. ఏదేమైనా టాలీవుడ్ లో ఇలా ఒక హీరో వద్దన్న కథ మరో హీరోకు కలిసొచ్చిన సందర్బాలు చాలా ఉన్నాయి. అలా కలిసొస్తే రామ్ కు హిట్ వస్తుంది. రామ్ కు హిట్ రాకపోతే విజయ్ దేవరకొండ డెసిషన్ కరెక్ట్ అవుతుంది. సింపుల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here