అనుష్క కోసం హాలీవుడ్ విలన్ ..?

0
164
భాగమతి తర్వాత కామ్ గా ఉండిపోయింది స్వీటీ బ్యూటీ అనుష్క. బాహుబలి వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత చేసిన భాగమతి కూడా బానే ఆడింది. అయితే అంతకు ముందు సైజ్ జీరో సినిమా కోసం పెంచిన వెయిట్ తన పాలిటి శాపంగా మారింది. దీంతో ఆ ఫ్యాట్ ను తగ్గించే పనిలో చాలా సీరియస్ గా ఉందిప్పుడు. ఈ మధ్య తను బాగా తగ్గింది అంటూ కొన్ని ఫోటోస్ కూడా వచ్చాయి. అయితే తగ్గిన తర్వాత తను ఓ సినిమా చేయబోతోందని ముందే అందరికీ తెలుసు. కోన వెంకట్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి విష్ణుతో ‘వస్తాడు నారాజు’ అనే సినిమా డైరెక్ట్ చేసిన హేమంత్ మధుకర్ దర్శకుడు. సినిమా పేరు ‘‘సైలెన్స్’’.
ఇప్పటికే సైలెన్స్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అనుష్క సరసన మాధవన్ నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి గతంలో ‘రెండు’ అనే సినిమాలో నటించడం విశేషం. మొత్తంగా ఈ సినిమాలో అత్యంత కీలకమైన విలన్ పాత్రకు ఓ ఫేమస్ హాలీవుడ్ నటుడ్ని సెలెక్ట్ చేసుకున్నారనేది లేటెస్ట్ న్యూస్. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్ సిరీస్ ‘కిల్ బిల్’ లో విలన్ గా నటించిన అతనే ఈ మూవీలోనూ విలన్ గా నటిస్తున్నాడట పేరు.. మైఖేల్ మాడ్సెన్. మొత్తంగా ఈ మధ్య రాజమౌళి తనయుడు పెళ్లిలో కనిపించిన అనుష్క త్వరలోనే సైలెన్స్ మూవీ చిత్రీకరణలో పాల్గొనబోతోంది. మరి ఈ హాలీవుడ్ విలన్ ఈ సినిమాకు ఎంత ప్లస్ అవుతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here