‘Hippi’ Movie Review

0
1003

RX100 సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కార్తికేయ ఇప్పుడు ‘హిప్పీ’ అంటూ మ‌రో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ తో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించాడు. టిఎన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో కార్తికేయ స్టైలిష్ మేకోవ‌ర్ తో ఆక‌ట్టుకున్నాడు. దిగంగ‌నా సూర్యవ‌న్షీ హీరోయిన్ గా న‌టించిన హిప్పీ ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం ఆక‌ట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కిక్ బాక్స‌ర్ అయిన హిప్పీ దేవ‌దాస్ (కార్తికేయ‌)కు స్నేహ(జెజ్‌బా సింగ్) ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తుంది. దేవ స్నేహ‌తో డేటింగ్ లో ఉన్న‌ప్పుడే గోవా వెళుతున్న స‌మ‌యంలో ఆముక్త మాల్య‌ద ( దిగంగ‌న సూర్య‌వ‌న్షీ) ని చూసి ఇష్ట‌ప‌డి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిన దేవా స్నేహ‌తో ల‌వ్ లో లేడ‌ని తెలుసుకుని ఆముక్త‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తాడు. ముందు ఫ్రెండ్ ల‌వ‌ర్ ను త‌న ల‌వ‌ర్ గా ఆముక్త ఒప్పుకోక‌పోయిన‌ప్ప‌టికీ త‌ర్వాత స్నేహే వాళ్లిద్ద‌రినీ ఒక‌టి చేస్తుంది. అక్క‌డి నుంచి దేవా, ఆముక్త‌ల ల‌వ్ స్టోరీ స్టార్ట్. రోజులు గడుస్తున్న కొద్దీ ఆముక్త కండిష‌న్స్ కు దేవ త‌ట్టుకోలేక ఎలాగైనా స‌రే వ‌దిలించుకోవాల‌నుకుంటాడు. అది ప‌సిగ‌ట్టిన ఆముక్త అతనితో లివ్ ఇన్ రిలేష‌న్‌షిప్ ను స్టార్ట్ చేస్తుంది. ఓ సంద‌ర్భంలో ఇద్ద‌రూ మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడిపోవ‌డం, త‌ర్వాత ఆముక్త , దేవ బాస్ అయిన జె.డి చ‌క్రవ‌ర్తిని పెళ్లి చేసుకోవాల‌నుకోవ‌డం, దేవ కూడా ఇంకో అమ్మాయి శ్ర‌ద్ధా దాస్ ను పెళ్లి చేసుకోవ‌డం లాంటివి జ‌రుగుతాయి. ఈ క్ర‌మంలో దేవ ల‌వ‌ర్ ఆముక్త‌ను పెళ్లి చేసుకుంటున్న అత‌ని బాస్ వారిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి ప్రాబ్ల‌మ్స్ లేవ‌ని తెలుసుకోవ‌డానికి ఒక  కండిష‌న్ పెడ‌తాడు. మ‌రి ఆ కండిష‌న్ ఏంటి?   చివ‌ర‌కు దేవ‌, ఆముక్త‌లు ఒక్క‌ట‌య్యారా లేదా అన్న‌ది మిగిలిన క‌థ‌.

మొద‌టి సినిమాలో ఒకే ఎమోష‌న్ తో, ఒకే ఎక్స్‌ప్రెష‌న్ లో క‌నిపించిన కార్తికేయ‌కు ఈ సినిమాలో బాగా వేరియేష‌న్స్ చూపించే అవ‌కాశం దొరికింది. అటు లుక్స్ తో పాటూ, ఇటు యాక్టింగ్ ప‌రంగానూ మంచి మార్కులే కొట్టేశాడు. యాక్ష‌న్ సీన్స్ లోనూ బాగా చేశాడు. దిగంగ‌నా సూర్య‌వన్షీ ఆముక్త మాల్య‌ద క్యారెక్టర్ లో ఇమిడిపోయి, న‌ట‌న‌తో పాటూ గ్లామ‌ర్ తోనూ ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంది. జెడీ చ‌క్ర‌వ‌ర్తి అర‌వింద్ పాత్ర‌ను చాలా ఈజీగా చేసేశాడు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ తో కాసేపు న‌వ్విస్తాడు. మిగిలిన వారిలో జెజ్‌బా సింగ్, శ్ర‌ద్ధా దాస్, బ్రహ్మాజీ, సుద‌ర్శ‌న్ లు త‌మ ప‌రిధి మేర‌కు ఆక‌ట్టుకున్నారు.

హిప్పీ చిత్రంతో యూత్ ని టార్గెట్ చేసిన డైర‌క్ట‌ర్ ..ప్రేమ‌, రొమాన్స్, లివింగ్ రిలేష‌న్స్ నేప‌థ్యంలో ప్ర‌స్తుత త‌రానికి అనుగుణంగా క‌థ‌ను రెడీ చేసుకున్న‌ప్పటికీ, ఓ ప‌దేళ్ల త‌రువాతి జెన‌రేష‌న్ ఎలా ఉండ‌బోతుందో చూపించాడు. రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలోనూ కాస్త లిమిట్స్‌ క్రాస్‌ చేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. కథ పరంగా బాగానే ఉన్నా కథనం మాత్రం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. కామెడీ బాగానే వర్క్‌ అవుట్ కావటం కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫి బాగుంది. నివాస్‌ కే ప్రసన్నా సంగీతం పరవాలేదు. పాటలు విజువల్‌గా బాగున్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః

కార్తికేయ న‌ట‌న‌
యూత్ ని ఆక‌ట్టుకునే సీన్స్

మైన‌స్ పాయింట్స్ః
స్లో నెరేష‌న్
స్క్రీన్ ప్లే
డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్

పంచ్‌లైన్ః ఘాటు ప్రేమ‌
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here