ఎఫ్ -2 విజయం.. అర్థం కాని సిట్యుయేషన్

0
2461
Mehreen Pirzada, Varun Tej, Venkatesh, Tamannaah in F2 Movie 50 Days Posters HD
ఎఫ్ -2 తక్కువ అంచనాలతో సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలనూ ఆశ్చర్యపరుస్తూ థియేటర్స్ లో తిరుగులేని నవ్వుల్ని పూయించింది. కంటెంట్ కొత్తగా లేకపోయినా కామెడీతో అలరించిన ఈ సినిమాకు ఆ టైమ్ లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద తేలిపోవడం కూడా కలిసొచ్చింది అనుకున్నారు. కానీ అది నిజం కాదు అనేది లేటెస్ట్ గా ఈ మూవీ కలెక్షన్స్ తో పాటు క్రియేట్ చేసిన రికార్డ్స్ కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇవాళా రేపూ ఎంత బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా అయినా.. యాభై రోజులు ఆడటం అనేది రేర్ గా కనిపిస్తోంది. ఒకవేళ ఆడినా ఎక్కడో కొన్ని సెంటర్స్ లో మాత్రమే కనిపిస్తోంది.. కానీ దశాబ్ధంన్నర క్రితం 50డేస్ అంటే ఎంత క్రేజ్ ఉండేదో అంత క్రేజ్ తెచ్చుకుందీ చిత్రం.  ఏకంగా 106 కేంద్రాల్లో 50 డేస్ ఆడేసింది. అది కూడా డైరెక్ట్ సెంటర్స్ లో. ఇప్పటికీ వీకెండ్స్ లో ఎఫ్ -2 థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్ తో కనిపిస్తుండటంతో ఖచ్చితంగా ఈ చిత్రం కనీసం 50 కేంద్రాల్లో వంద రోజులు ఆడుతుంది అంటున్నారు.
దిల్ రాజు ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ ఈ మూవీకి వెంకటేష్ కామెడీ టైమింగ్ తో పాటు వరుణ్ తేజ్ కొత్త ప్రయత్నం బాగా కలిసొచ్చింది. ఇక థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుల్ని లాజిక్ ను దాటించి నవ్వించడమే టార్గెట్ గా ముందు నుంచీ సినిమాలు చేస్తోన్న దర్శకుడు అనిల్ రావిపూడి తన ప్రయత్నంలో ఈసారి డబుల్ సక్సెస్ అయ్యాడు. ఏకంగా సెంచరీ కొట్టాడు. మామూలుగానే వంద కోట్ల సినిమాగా నిలిచిన ఎఫ్ -2 ఇప్పటి వరకూ 140కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అంటే దాదాపు 84 కోట్ల షేర్ వచ్చిందన్నమాట. ఇది సినిమా బడ్జెట్ కు డబుల్ ప్రాఫిట్.. సో ఈ యేడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఆల్రెడీ ఎఫ్ -2 తన పేరు నమోదు  చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here