Tuesday, March 19, 2019
Home News Entertainment news ఆకట్టుకుంటోన్న ‘చిత్రలహరి’

ఆకట్టుకుంటోన్న ‘చిత్రలహరి’

0
2476
చిత్రలహరి.. ఇన్ని టివి ఛానల్స్ లేని టైమ్ లో ఉన్న ఒకే ఒక్క ఎంటర్టైనర్ దూదర్శన్ ఛానల్. ఆ ఛానల్ లో ప్రతి శుక్రవారం వచ్చే చిత్రలహరి ప్రోగ్రామ్ కోసం వారమంతా ఎదురుచూసిన తరాలు ఉన్నాయి. అలాంటి టైటిల్ తో సినిమా అంటే ఖచ్చితంగా చాలామందికి ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. నేను శైలజతో మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కిశోర్ తిరుమల తన మూడో సినిమాకు ఈ టైటిల్ పెట్టేసుకున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న తేజూకి ఇది బ్రేక్ ఇచ్చే సినిమాగా చెప్పుకున్నారు చాలామంది. అది నిజమే అనడానికి ఇవాళ విడుదలైన టీజర్ ఓ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు.
సాయిధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సునిల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు ముందు నుంచీ చెబుతున్నారు. ఇవాళ ఈ నలుగురు పాత్రలనే పరిచయం చేసింది టీమ్. టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. కాకపోతే ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీలా కనిపించలేదీ టీజర్ లో. నాలుగు పాత్రలూ పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏ పాత్రలోనూ సిమిలాటీస్ కనిపించడంలేదు. నివేదా పేతురాజ్ కాస్త స్ట్రాంగ్ క్యారెక్టర్ లా ఉంది. ఆలోచించకుండా, డిస్కస్ చేయకుండా ఏ పనీ చేయకూడదు అనేలా ఉంది కళ్యాణి క్యారెక్టర్. కాస్త అమాయకత్వం.. ఇంకాస్త లాజిక్ నిండినట్టుగా ఉన్నాడు సునిల్. ఇక బ్యాడ్ లక్ బాయ్ గా తేజూను పరిచయం చేశాడు దర్శకుడు. టీజర్ లోని డైలాగ్స్ ను బట్టి అతను ప్రేమించిన అమ్మాయి కూడా తన లైఫ్ లో నుంచి వెళ్లిపోయినట్టే ఉంది. తర్వాత మరో అమ్మాయి.. పరిచయం కావొచ్చు.

ఇక టైటిల్ పరంగా ఇది ఇద్దరు అమ్మాయిల పేర్లుగా చెప్పారు. అంటే చిత్ర, లహరి అనే అమ్మాయిల పేర్లే టైటిల్ గా పెట్టేశారన్నమాట. మొత్తంగా ఈ సినిమాతో తేజూకు విజయం ఖాయంగానే కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by :