ఎండ‌ల్లో ఎమోష‌న‌ల్ టాలీవుడ్

0
354
అదేంటో ఎన్నడూ లేనిది టాలీవుడ్ కు ఈ ఏప్రిల్ లో ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇప్పటిదాకా విడుదలైన మూడు సినిమాల్లో ఎమోషన్ కు పెద్ద పీట‌ వేయడం అవి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉండటం మొత్తానికి వేసవిలో కూల్ గా బాక్స్ ఆఫీస్ ని కళకళలాడుతు ఉండేలా చేశాయి. మొదట వచ్చిన మజిలీ సూపర్ హిట్ కావడానికి కారణం చైతు సామ్ ల మధ్య కెమిస్ట్రీ మేజ‌ర్ రీజన్ కాగా ద‌ర్శ‌కుడు శివ‌ నిర్వాణ ఏర్పరిచిన ఎమోషనల్ బాండింగ్ ఇంకో రీజ‌న్. ఈ రెండూ మ‌జిలీకి స‌క్సెస్ ను అందించాయి.

ఇక రెండో వారంలో విడుదలైన చిత్రలహరి కంటెంట్ మీద కాస్త నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఓ నిరుద్యోగి బాధ‌ను చక్కని సంభాషణలతో ఫాదర్ సెంటిమెంట్ ని లింక్ చేసిన తీరు యూత్ కి కొద్దిగా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఫలితంగా తక్కువ బిజినెస్ జరిగినప్పటికీ త్వరగానే బ్రేక్ ఈవెన్ చేరుకొని నిర్మాతలతో పాటు బయ్యర్లను ఒడ్డున పడేసిందని  వసూళ్లు చెబుతున్నాయి

ఇక ఇవాళ వచ్చిన నాని జెర్సీ ఈ రెండింటికి డబుల్ డోస్ తరహాలో అవుట్ అండ్ అవుట్ ఎమోషన్ తో హృదయాలను తాకుతోందని సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రు చెప్పుకుంటున్నారు. నాని కెరీర్ బెస్ట్ ఇచ్చాడని ఇంత చక్కని భావోద్వేగాలు ఈ మధ్యకాలంలో చూడలేదని ప్రేక్షకులు అంటున్నారు. ఏ రేంజ్ హిట్ అనేది చెప్పడం తొందపాటుతనం అవుతుంది కానీ మొత్తానికి జెర్సిలో ఊహించిన దాని కన్నా డబుల్ డోస్ ఎమోషన్ ఉందన్న సినిమా చూసిన ప్ర‌తీ  ఒక్క‌రు చెప్పుకొచ్చారు.

ఈ ఏప్రిల్ లో వ‌చ్చిన సినిమాల్లో మొద‌టి స్థానం ఇప్పుడు ప్రేక్ష‌కులు జెర్సీకి ఇవ్వ‌డం విశేషం. చై ఇంక సామ్ ఆడియ‌న్ప్ ని బాగా ఎట్రాక్ట్ చేసినా జెర్సీ చూసిన ప్రేక్ష‌కులు మాత్రం వారిద్ద‌రికి  రెండో స్థానం ఇచ్చారు. మొత్తానికి మూవీ లవర్స్ కి ఏప్రిల్ మొత్తం ఎమోషనల్ నెలగా గడవడం చూస్తే టాలివుడ్ కి మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చాయ‌ని అన‌డంలో ఆశ్చ‌ర్య‌మేమీ లేదు