Dorasani Pre Look Poster Seems Interesting

0
460

‘దొర‌సాని’ చిత్రంతో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. కెవి మ‌హేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంతో జీవిత రాజ‌శేఖ‌ర్ ల కూతురు శివాత్మిక హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది. త్వ‌ర‌లో విడుద‌లకు రెడీ అయిన ఈ సినిమాకు ప్రీ లుక్ పోస్ట‌ర్ తో ప్ర‌మోష‌న్స్ మొద‌ల‌య్యాయి.

హీరోయిన్ చేతిని హీరో చేతికి అందిస్తున్న‌ట్లు క‌నిపిస్తున్న ఈ పోస్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్ లో ”క‌థ‌వు నువ్వే…. కాల‌గ‌మ‌నంలో చెరిగిపోని ముత్యం నువ్వే..” అంటూ సాగే ఒక పెద్ద క‌విత కూడా ఉంది. ప్రీ లుక్ తోనే సినిమాలో ఏదో మ్యాట‌ర్ ఉందే అనుకునేలా ఉన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ మే 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఆనంద్ దేవ‌ర‌కొండ శివాత్మ‌క ల డెబ్యూ సినిమాను మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, య‌ష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కూడా ఈ సినిమాలో భాగ‌స్వాములుగా ఉండ‌టం గ‌మ‌నించాల్సిన విష‌యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here