‘దేవ్’ మూవీ రివ్యూ

0
2207

తమిళ హీరో కార్తీకి త‌మిళంలో పాటుగా తెలుగులో కూడా అభిమానులున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త త‌ర‌హా క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న కార్తీ ఇప్పుడు దేవ్ గా అభిమానుల‌ను అల‌రించ‌డానికి రెడీ అయ్యాడు. యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కులను ఏ మేర ఆక‌ట్టుకుందో స‌మీక్షలో చూద్దాం.

లైఫ్ లో ప్ర‌తీ మూమెంట్ ను ఎంజాయ్ చేసే దేవ్ (కార్తీ)కి ఎప్పుడూ ఒకే చోట ఉండ‌టం కంటే అడ్వెంచ‌రస్ ట్రావెల్ అంటే చాలా ఇష్టం. దేశంలోని ప్ర‌తీ మూల తిరిగి ప్ర‌కృతిని ఆస్వాదించాల‌నుకునే రకం. దేవ్ మేఘన (ర‌కుల్) ను చూసి మొద‌టి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌టం, త‌న‌ని ప్రేమించ‌మ‌ని మేఘ‌న వెంట ప‌డ‌టం.. కానీ మేఘ‌న‌కు త‌నంటే ఇష్టం లేద‌ని తెలుసుకుని ప‌క్క‌కు త‌ప్పుకుంటాడు దేవ్. త‌ర్వాత దేవ్ మంచిత‌నాన్ని తెలుసుకున్న ర‌కుల్ అత‌ని ప్రేమ‌లో ప‌డుతుంది. ఆ త‌ర్వాత కార్తీ త‌న‌కు టైమ్ ఇవ్వ‌డం లేద‌ని అత‌నికి దూర‌మ‌వుతుంది. ఈ బాధలో ట్రావెల్ చేస్తున్న కార్తి యాక్సిడెంట్ కు గురి అవుతాడు. ఆ త‌ర్వాత దేవ్, మేఘ‌న జీవితంలో ఏం జ‌రిగిందనేది దేవ్ సినిమా క‌థ‌.

ఇప్ప‌టికే ఖాకీ, చిన‌బాబు వంటి డిఫ‌రెంట్ మూవీస్ తో ఆక‌ట్టుకున్న కార్తీ ఇప్పుడు పూర్తి అర్బ‌న్ నేపథ్య‌మున్న సిటీ కుర్రాడి పాత్ర‌లో ఇట్టే ఒదిగిపోయాడు. ఈ సినిమాలో ప్ర‌యాణాలంటే ఇష్ట‌ప‌డే ట్రావెల‌ర్ పాత్ర‌లో బాగా ఇమిడిపోయాడు కార్తీ. ఏ ప‌నిచేసేట‌ప్పుడు డ‌బ్బు, పేరు క‌న్నా మ‌న‌సు ప్ర‌శాంతంగా, సంతోషంగా ఉంటుందో అదేరా నువ్వు చేయాల్సిన ప‌ని అంటూ కార్తి చెప్పే కొన్ని డైలాగ్స్ మ‌నసును తాకుతాయి. ఎమోష‌న‌ల్ గా కూడా కార్తీ న‌ట‌న చాలా బావుంది. మొత్తంగా ఒక ట్రావెలర్ గా పూర్తి వైవిధ్యాన్ని చూపించాడు. ర‌కుల్ క్యారెక్ట‌ర్ ఉన్నంత‌లో బావుంది. ర‌మ్య‌కృష్ణ, ప్ర‌కాష్ రాజ్, మిగిలిన వారు త‌మ త‌మ ప‌రిధుల్లో ఫ‌ర్వాలేద‌నిపించారు.

ద‌ర్శ‌కుడు అనుకున్న క‌థ బావుంది కానీ దాన్ని ప్రెజెంట్ చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడ‌నే చెప్పాలి. ట్రావెల‌ర్ గా కార్తీ ని ఇంట‌ర్వెల్ వ‌ర‌కు బాగానే ప్రెజెంట్ చేయ‌డం, హీరోయిన్ తో ప్రేమ‌లో ప‌డ‌టం, ఆమె రిజెక్ట్ చేయ‌డం… అన్నీబావున్నాయి. త‌ర్వాత హీరోయిన్ త‌న త‌ప్పు తెలుసుకుని హీరోని ప్రేమించడం మొద‌లుపెడుతుంది. అక్క‌డితో డైర‌క్ట‌ర్ చెప్పాల‌నుకున్న క‌థ అయిపోయింది. ఆ త‌ర్వాత ఏం చేయాలో అర్థం కాని ద‌ర్శ‌కుడు క‌థ‌ను ఇష్ట‌మొచ్చిన‌ట్లు మ‌లిచాడు. సినిమా మొద‌లు పెట్టిన దగ్గ‌ర నుంచి స్లో నెరేష‌న్ ఉండ‌టం వ‌ల్ల అస‌లు మ‌నం సినిమానే చూస్తున్నామా..? ఇంకెంత సేపురా బాబోయ్ అనుకునే ప‌రిస్థితి క‌ల్పించాడు ద‌ర్శ‌కుడు . సినిమాకు ప్ల‌స్ ఏదైనా ఉందా అంటే అది సినిమాటోగ్ర‌ఫీనే. ప్ర‌తీ ఫ్రేమ్ ఎంతో అందంగా తెర‌కెక్కించాడు. హిమాల‌య అందాల‌ను బాగా తెర‌కెక్కించాడు. హరీష్ జ‌య‌రాజ్ సంగీతం ఫర్వాలేక‌పోయిన‌ప్ప‌టికీ, రీరికార్డింగ్ బావుంది. నిర్మాణ విలువ‌లు సినిమా రేంజ్ కంటే ఎక్కువే ఖ‌ర్చు పెట్టారు.
ప్ల‌స్ పాయింట్స్ః 
కార్తీ న‌ట‌న‌
సినిమాటోగ్ర‌ఫీ
మైన‌స్ పాయింట్స్ః
స్లో నెరేష‌న్
ద‌ర్శ‌క‌త్వం
పంచ్‌లైన్ః దేవ్ తో జ‌ర్నీ క‌ష్ట‌మే..!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here