దీప్తి సునైనా స్ట్రాట‌జీతోనే ఆడుతుందా..?

0
309

నాని హోస్ట్‌గా బిగ్ బాస్ 2 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. 100 రోజుల పాటు జరిగే ఈ షోలో పాల్గొనేందుకు మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి ఎంటరయ్యారు. బిగ్ బాస్ షో అంటేనే కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు రాజేసి ప్రేక్షకులకు వినోదం పంచడం. ఇందులో భాగంగా తొలి రోజే నుంచే పోటీ దారుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్ రెండో రోజు ఇంటి నుంచి బయటకు పంపడం కోసం మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. బిగ్ బాస్ అంద‌రి ఇంటి సభ్యుల నుండి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం…. ఎక్కువ ఓట్లు పడిన దీప్తి సునైన, గణేష్, కిరీటి, కౌశల్, నూతన్, సంజన ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఇంటి నుండి బయటకు వెళతారు అనేది వచ్చే వారం నాని తేల్చనున్నాడు. ఎలిమినేషన్ అనేది ప్రేక్షకులు వేసే ఓట్లపై ఆధారపడి ఉంది కాబ‌ట్టి, ఇప్ప‌టి వ‌ర‌కు ప్రేక్ష‌కులు దీప్తి సునైనాకే ఎక్కువ ఓట్లు వేశారు. 1669 ఓట్లతో దీప్తి ఫ‌స్ట్ పొజిష‌న్ లో ఉంది. సోష‌ల్ మీడియాలో ముందు నుంచి మంచి పాపులారిటీ ఉండ‌టంతో దీప్తికి ఓట్లు ప‌డ్డాయో, లేదా త‌ను బిగ్ బాస్ కు వెళ్లే ముందే ఒక ప్లాన్ ప్ర‌కారం స్ట్రాట‌జీని మెయిన్టెయిన్ చేసి, ఓట్లు వేయించుకుంటుందో తెలీదు కానీ దీప్తికి మాత్రం ఓట్లు బాగానే ప‌డుతున్నాయి. కౌశల్ 965 ఓట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.నూత‌న్ నాయుడు కు913 ఓట్లు, కిరీటికి 796 ఓట్లు, గ‌ణేష్ కు 736 ఓట్లు రాగా, సంజ‌నా అన్నె అంద‌రికంటే తక్కువ‌గా, 577 ఓట్లతో చివ‌రి స్థానంలో ఎలిమినేష‌న్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది. ఎలిమిషేన్ కు ఇంకో రెండ్రోజులు టైమ్ ఉన్న నేప‌థ్యంలో బిగ్ బాస్ నుంచి మొద‌ట ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రా అన్న‌ది అందరికీ ఆస‌క్తిగా మారింది. చూద్దాం ఈ రెండ్రోజుల్లో ‘ఏదైనా జ‌ర‌గొచ్చు’..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here