‘ద‌మ్ముంటే సొమ్మేరా’ మూవీ రివ్యూ

0
136
దిల్లుకు దుడ్డు. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన ఈ సినిమాను ‘ద‌మ్ముంటే సొమ్మేరా’ అనే పేరుతో తెలుగులోకి అనువ‌దించి, తెలుగు ప్రేక్ష‌కులు ఈ మ‌ధ్య బాగా ఆద‌రిస్తున్న హార్ర‌ర్ కామెడీ తో రూపొందించిన ఈ సినిమా ఇవాళే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మ‌రి త‌మిళంలో మంచి విజ‌యాన్ని అందుకున్న సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందో లేదో చూద్దాం.
క‌థః 
కొన్ని సంవ‌త్స‌రాల కింద‌ట శివ‌గంగ ప‌ర్వ‌తం మీదున్న బంగ్లాలో ఒక అమ్మాయి, మ‌రొక ఇద్ద‌రు కొన్ని బ‌ల‌వంత‌పు కార‌ణాల వ‌ల్ల చావుకు గుర‌వుతారు. వాళ్లు ద‌య్యాలుగా మారి అక్క‌డే సంచ‌రిస్తూంటారు. మ‌రోవైపు ఏ ప‌నీ పాటా లేని కుమార్(సంతానం) త‌ను చిన్న‌తనంలోనే ఇష్ట‌ప‌డిన కాజ‌ల్ (ష‌నాయా)ని పెద్ద‌య్యాక క‌లుసుకుంటాడు. కాజ‌ల్ కూడా కుమార్ ను ఇష్టప‌డుతుంది. కానీ అది ఇష్టం లేని కాజ‌ల్ ను చంపించ‌డానికి ఒక రౌడీ ద‌గ్గ‌ర‌కు వెళ్లడం, వారు కుమార్ ను శివ‌గంగ ప‌ర్వ‌తం మీదున్న బంగ్లా అయితే కుమార్ ను చంప‌డానికి వీలుగా ఉంటుంద‌ని భావించి అక్క‌డికి తీసుకెళ్లడం జ‌రుగుతాయి.ఆ బంగ్లాలోకి వెళ్లిన త‌ర్వాత వారికి వింత అనుభ‌వాలు ఎదుర‌వుతాయి. దానికి కార‌ణం ఏంటి? అస‌లు ద‌య్యాల్లాగా అక్క‌డ సంచ‌రిస్తున్న వారు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మేంటి?  చివ‌ర‌కు కాజ‌ల్, కుమార్ లు ఎలా ఒక‌టయ్యార‌న్న‌దే క‌థ‌.
న‌టీన‌టుల ప్ర‌తిభః 
సంతానం హీరోగా కంటే క‌థ‌ను ముందుకు న‌డిపించే న‌టుడిగానే క‌నిపిస్తాడు. క‌మెడియ‌న్ లా కాకుండా సిన్సియ‌ర్ హీరోలానే క‌నిపించాడు. ష‌నాయా కొత్త‌మ్మాయి అయినా లుక్స్ ప‌రంగా ఓకే అనిపించింది. యాక్టింగ్ స్కిల్స్ కూడా ఫ‌ర్వ‌వాలేదు. హీరోయిన ఫాద‌ర్ గా సౌర‌భ్ శుక్లా న‌ట‌న సినిమాకు ప్ల‌స్ అయింద‌. కార్తీక్ తో క‌లిసి త‌ను చేసిన కామెడీ వ‌ర్క‌వుట్ అయింది. సెకండాఫ్ మొత్తాన్ని త‌న కామెడీతోనే నడిపించాడు. మిగిలిన వారు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించారు.
సాంకేతిక నిపుణులుః 
మొద‌టి 20 నిమిషాల సినిమా కాస్త ఇబ్బంది పెట్టిన‌ప్ప‌టికీ, డైర‌క్ట‌ర్ ఎంచుకున్న క‌థ‌నం మాత్రం కాస్త భిన్నంగా ఉండి ఆక‌ట్టుకుంది. రొటీస్ ఫార్మాట్ లో ఉన్న ల‌వ్ స్టోరీ ఏమంత గొప్ప‌గా అనిపించ‌దు. ఇంట‌ర్వెల్ కు ముందు వ‌చ్చే సీన్స్ కాస్త థ్రిల్లింగ్ అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా కాస్త కొత్తగా ట్రై చేసి మెప్పిస్తాడు. సాంకేతిక‌ప‌రంగా చెప్పాలంటే సినిమాలో మేజ‌ర్ క్రెడిట్ సినిమాటోగ్ర‌ఫ‌ర్ దీపక్ కుమార్ కు ఇవ్వాలి. కార్తీక్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా స్థాయి ని పెంచేలా ఉంది. పాట‌లేవీ పెద్ద‌గా ఆక‌ట్టుకోవు. ఎడిటింగ్ ఉన్నంత‌లో ఫ‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్లు చాలా బావున్నాయి.
ప్ల‌స్ పాయింట్స్ః 
కామెడీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్ర‌ఫీ
మైన‌స్ పాయింట్స్ః 
త‌మిళ వాస‌న‌లు
మొదటి 20 నిమిషాలు

పంచ్‌లైన్ః ద‌మ్ము కావాల్సిందే!

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here