క్రేజీ క్రేజీ ఫీలింగ్ పోస్టర్ ఆవిష్కరించిన వి . హనుమంత రావు

0
211

విజ్ఞత ఫిలిమ్స్ పతాకం పై నూతలపాటి మధు నిర్మాతగా సంజయ్ కార్తీక్ దర్శకత్వం లో రూపొందిన చిత్రం ” క్రేజీ క్రేజీ ఫీలింగ్ ” . కేరింత , మనమంతా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ , పల్లక్ లల్వాని జంటగా వెన్నెల కిషోర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా పోస్టర్ కాంగ్రెస్ సీనియర్ నేత వి . హనుమంత రావు ఆవిష్కరించారు . ఈ సందర్బంగా ఆయన ఈ సినిమా తప్పక విజయం సాధించాలని ఆకాంక్షించారు . అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ చించితేనే అంత ప్రచారం జరిగితే మరి ఆయన చేతుల మీద ఆవిష్కరణ జరిగితే ఇంకెంత పబ్లిసిటీ అవుతుందన్న చిత్ర బృందం వ్యాఖ్యలకు వి.హెచ్ చిరునవ్వులు చిందించారు . ఈ సందర్బంగా విశ్వంత్ ” దిల్ రాజు గారి కేరింత , సాయి కొర్రపాటి గారి మనమంతా చిత్రాల తరువాత మంచి కథ కోసం వెయిట్ చేశాను . పూర్తి వినోదాత్మకంగా కుటుంబమంతా చక్కగా నవ్వుకునే ఈ సినిమా విజయం పై నమ్మకముంది” అన్నారు . సెన్సార్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి క్రేజీగా ఎదురుచూస్తున్నాము అన్నారు దర్శక రచయిత సంజయ్ కార్తీక్ . వెన్నెల కిశోర్ కు జంటగా ఫిదా ఫెమ్ శరణ్య నటించిన ఈ చిత్రం లో ఇంకా పోసాని , సుమన్ , జయప్రకాష్ రెడ్డి , గుండు సుదర్శన్ , కృష్ణం రాజు ,చమ్మక్ చంద్ర , భద్రం ,అదిరే అభి , జబర్దస్త్ ఫణి , రాకేష్ , ప్రియాంక ,షాఫీ తదితరులు నటించారు . సంగీతం భీమ్స్ సిసిరోలియో , సాహిత్యం సురేష్ ఉపాధ్యాయ , కాసర్ల శ్యామ్ , కెమెరా సుభాష్ దొంతి , ఎడిటింగ్ మేనేజ్ శ్రీను , ఆర్ట్ నాగు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here