కామెడీ సరే.. కథలేవీ అనిల్

0
894
కామెడీతో హిట్లు కొట్టడం ఓ పద్దతి. కానీ కేవలం కామెడీనే నమ్ముకుని కథలను లైట్ తీసుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని నమ్ముతున్న దర్శకుడుగా అతన్ని చెప్పొచ్చు. ఆ ఎంటర్టైన్మెంట్ ను ఎలా అందించామన్నదే ఇంపార్టెంట్ కానీ.. దానికి ఎంత కథను ముడివేశామన్నది మనోడికి క్రైటీరియా కాదు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే అతని మొదటి మూడు సినిమాల్లోనూ గొప్ప కథలు లేవు. అలాగని కాన్ ఫ్లిక్ట్స్ కూడా ఉండవు. పటాస్ లో తండ్రి కొడుకుల మధ్య ఈగోస్ చూపించాడు. ఇది కొత్త పాయింట్ అయితే కాదు. అప్పుడు కూడా కామెడీనే నమ్ముకున్నాడు. తర్వాత సుప్రీమ్.. తనది కాని లక్ష్యం కోసం హీరో చేసే త్యాగం.. అగెయిన్ ఓల్డ్ స్టోరీ. మళ్లీ ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకున్నాడు. ఇక రవితేజతో చేసిన రాజా ది గ్రేట్ అయితే కామెడీ పేలితే హీరో గుడ్డివాడైనా ఫర్వాలేదు అనడమే కాదు.. ఆ అంధుడు ఏం చేసినా చెల్లుతుంది అనేలా సినిమాటిక్ లిబర్టీస్ మరీ హెవీగా తీసుకున్న సినిమా..
ఇక ఇప్పుడు ఎఫ్ -2.
ఎఫ్ -2లో ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగా వర్కవుట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ లో ఏదో ఒక పాయింట్ చెప్పాలి కదా. అతని వద్ద పాయింట్ లేదు. దీంతో బాగా తడబడ్డాడు. ఇక్కడా కామెడీ కోట్ చేయాలనుకున్నా కుదర్లేదు. దీంతో మరోసారి పాత చింతకాయ పాఠాలే చెబుతూ నాజర్ తో సీన్ చేయించాడు. ఆ సీన్ లో ఉన్న డైలాగ్స్ ఎన్నో సినిమాల్లో ఉన్నవే. ఇంకా చెబితే ఇంచుమించు అలాంటి డైలాగ్స్ తోనే ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ కూడా వచ్చాయి. అలాగే అక్కడ అతని పాత్రల మధ్య కూడా ఏ కాన్ ఫ్లిక్ట్ లేదు. ఫైనల్ గా ‘‘అనసూయను మేమే పిలిపించాం’’ అని హీరోయిన్లత చేత చెప్పించిన డైలాగ్స్ కూడా ఏ మాత్రం ఎమోషనల్ గా వర్కవుట్ కాలేదు..
నిజానికి అనిల్ రావిపూడిలో మంచి ఎంటర్టైనర్ ఉన్నాడు. దానికి కాస్త కథను కూడా జోడిస్తే మంచి దర్శకుడుగా ఎదుగుతాడు. అసలు కథలకు కామెడీని జోడిస్తే వచ్చే కిక్ (దర్శకుడికే కాదు.. ఆడియన్స్ కు కూడా)..వేరే. ఇంకా చెబితే అనిల్ కంటే జెన్యూన్ కామెడీని క్రియేట్ చేసిన జంధ్యాల, రేలంగి, ఇవివి వంటి దర్శకులు కూడా కథలోనే కామెడీ ఉండేలా చూసుకున్నారు. కానీ అనిల్ మాత్రం కామెడీలో కథ చూపించే ‘ప్రయత్నం’ చేస్తున్నాడు. ఈ లైన్ కాస్త దాటితే అనిల్ కూడా (రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు) మరో జంధ్యాల అవుతాడని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here