Wednesday, October 16, 2019

వ‌ర్మ దెబ్బ‌.. సెన్సార్ టీమ్ అబ్బ‌

తాను దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు సర్టిఫికేషన్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు కావాలనే తాత్సారం చేస్తోందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డుపై...

జెస్సీ` చిత్రాన్ని స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్

అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `జెస్సీ`. ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై వి.అశ్విని కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్వేతా...

FTV Fashion Calendar in Hyderabad

Kamar Film Factory has launched FTV Fashion Calendar in a grand ceremony held in city along with the Tollywood Box Cricket League Logo Launch...

పరారి ఫస్ట్‌లుక్‌ విడుదల

గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పరారి'. సాయి శివాజీ దర్శకత్వంలో గాలి.వి.వి. గిరి నిర్మిస్తున్నారు. ''రన్‌ ఫర్‌ ఫన్‌ '' అనేది ఉప శీర్షిక. ఈ...

కె.విశ్వ‌నాథ్ చేతుల మీదుగా `ఇద్ద‌రు` టీజ‌ర్ విడుద‌ల‌

యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, జె.డి.చ‌క్ర‌వ‌ర్తి , రాధికా కుమార‌స్వామి, కె.విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `ఇద్ద‌రు`. ఎఫ్‌.ఎస్. ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎస్‌.ఎస్‌.స‌మీర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫ‌రీన్ ఫాతిమా నిర్మాత‌....

ప్రేమ అంత ఈజీ కాదు’టీజర్‌ విడుదల

రాజేష్‌కుమార్‌, ప్రజ్వాల్‌ జంటగా పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో ఈశ్వర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. టి.నరేష్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా...

ప్రతిభావంతురాలికి లక్ష రూపాయల అన్నపూర్ణ స్కాలర్షిప్….

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ ఐ ఎస్ ఎఫ్ ఎమ్ లో జరిగిన కార్యక్రమంలో 'షీ ఇన్స్పైర్స్' ప్రోగ్రాం విజేతలను శ్రీమతి అమల అక్కినేని సత్కరించారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిలిం...

సిరివెన్న‌ల సీతారామ‌శాస్ర్తికి ఘ‌నంగా స‌న్మానం!

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్ర్తికి ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ శ్రీ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు సినీ రచయితల సంఘం బుధవారం హైదరాబాద్‌లో సిరివెన్నెలని ఘనంగా...

భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారం..

భారతీయ డాక్యుమెంటరీ ‘పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’ చిత్రానికి ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారం లభించింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా, రేకా జెహతాబ్చి దర్శకత్వంలో నిర్మించిన ‘పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’ చిత్రం...

Latest article

రాఘవేంద్ర రావు గారి మాటలను ఎప్పటికి మర్చిపోలేను – ‘ఎవ్వరికి చెప్పొద్దు’ డైరెక్టర్ శంకర్

క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాకేశ్‌ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్‌ దర్శకత్వంలో రాకేశ్‌ వర్రె నిర్మాణంలో రూపొందిన లవ్‌స్టోరీ 'ఎవ్వరికీ చెప్పొద్దు'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై దిల్‌రాజు రిలీజ్ చేసాడు.ఎవ్వరికి చెప్పొద్దు అంటూ సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అందరికి చెప్పేంత మంచి సినిమాగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్, హీరోయిన్ గార్గేయి లు మీడియా తో ముచ్చటించారు. అసలు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది? క్యాస్ట్ గురించి వస్తున్న సినిమా కాబట్టి స్టోరీ చెప్పగానే నిర్మాతలు కథను, నన్ను నమ్మి ప్రాజెక్టు ని ఓకే చేసేసారు. కానీ సినిమా డిలే అవుతుండటం తో వేరే ఫ్రెండ్ రాకేష్ గురించి చెప్పాడు తాను కూడా ఇలాగే బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడని. అలా రాకేష్ ని కలవడం, సినిమా చేయడం జరిగింది. రాకేష్ గురించి.. రాకేష్ అందరిలా కాదు. తాను చాలా చాలా ఇంటెలిజెంట్ గా వర్క్ చేస్తాడు. ఏదైనా సినిమా లో క్యారెక్టర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసి.. ఆ క్యారెక్టర్ కి అనుగుణం గా తాను మారి, ఒక చిన్న డెమో లాంటిది రెడీ చేసుకుని అప్పుడు డైరెక్టర్ ని కలుస్తాడు.. అంత మంచి యాక్టర్ రాకేష్. అసలు మీకు క్యాస్ట్ మీద సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? రియల్ లైఫ్ లో క్యాస్ట్ తో ఏమైనా ఇబ్బంది పడ్డారా? క్యాస్ట్ అనేది సెంట్రల్ సబ్జెక్ట్. కరెక్ట్ గా హేండిల్ చేయగలిగితే మంచి సినిమా అవుతుంది కదా అనిపించింది.  నా రియల్ లైఫ్ లో అంటే క్యాస్ట్ వాళ్ళ పెద్దగా ఇబ్బంది పడింది లేదు కానీ ఈ సినిమా కి ఇన్సిపిరేషన్ మాత్రం నా ఫ్రెండ్. తనకి చాలా దారుణంగా బ్రేకప్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను మళ్ళీ రిలేషన్ జోలికి వెళ్ళలేదు. తన లైఫ్ ని చూసే ఈ సినిమా స్టోరీ రెడీ చేసుకున్నాను. అసలు మీ సినీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది..? మీ మొదటి సినిమా ఏంటి ? మొదటి సినిమా అంటే ఎన్నో ఏళ్ళ కిందటే చేసాను. ఇంకోసారి అనే సినిమా చేశా.. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు జాబ్ చేశాను. అసిస్టెంట్ ప్రొఫసర్ గా.   తర్వాత బిస్కెట్, రన్ రాజా రన్, పెళ్లి చూపులు సినిమా లకి పని చేశా.. మీ నేటివ్ ప్లేస్.. బేసిక్ గా మా పేరెంట్స్ ది కృష్ణా జిల్లా. కానీ నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. హీరోయిన్ ని ఎలా సెలెక్ట్ చేశారు? ఆడిషన్స్ లోనే. ఈ  రోల్ కోసం దాదాపు 150 మందిని ఆడిషన్ చేసాం. రోజుకి 7 -8  మంది కంటే ఎక్కువ ఆడిషన్ చేసేవాళ్ళం కాదు. అలా అంతమంది లో గార్గేయి ని సెలెక్ట్ చేసాం.. గార్గేయి ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఏం స్పెషల్ ఉంది తనలో? తనది క్లీన్ జాబ్. ఒక సరైన నటి కానీ, నటుడు కానీ దొరికితే మాత్రమే అది సాధ్యమవుతుంది. తన ఫొటోస్, కెమెరా వైపు చూసే విధానం లోనే తెలిసిపోయింది నాకు గార్గేయి గురించి. అలా తాను సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఇంకో సర్ప్రైజ్. తాను తెలుగు అమ్మాయి అవడం.. అది కూడా మాకు చాలా కలిసొచ్చింది. ఈ సినిమా కి ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కంప్లిమెంట్ ఏంటి? రాఘవేంద్ర రావు గారు ఫోన్ చేసి చాలా మంచి సినిమా చేసావు.. క్యాస్ట్ గురించి ఇలాంటి సినిమా ని తీయగలగడం గొప్ప విషయం అని అభినందించారు. ఈ సినిమా లో పర్టికులర్ గా ఈ హీరోనే అని అనుకున్నారా? అదేం లేదండి. కథ మొత్తం రాసుకున్నాక మంచి ఆర్టిస్ట్ దొరికితే చాలు అనుకున్న.లక్కిలీ నాకు రాకేష్ దొరికాడు. తాను మంచి యాక్టరే కాదు, మంచి అందగాడు, తెలివైన వాడు కూడా.. దిల్ రాజు రాకముందు, వచ్చిన తర్వాత ఏమైనా మార్పులొచ్చాయా సినిమా లో? కొన్ని కొన్ని... దిల్ రాజు గారు మూవీ చుసిన వెంటనే ఇంత లెంగ్త్ వద్దని, ట్రిమ్ చేయమన్నారు. ఈయనకేం తెలుసు ఆయన ప్రొడ్యూసర్.. నా సినిమా నాకే తెలుసుతుంది. డైరెక్టర్ ని నేను అనుకున్నాను.. కానీ ఇవాళ రన్ టైం అనేది సినిమా కి చాలా ప్లస్ అయింది. అంత ఆయన వల్లే.. సినిమా కి ముందు ఇది కాకుండా వేరే టైటిల్స్ ఏమైనా అనుకున్నారా? అసలు సినిమా టైటిల్ ముందు అనుక్కున్నది అయితే 'ఎవ్వరికి చెప్పొద్దు నా పెళ్లి'. సినిమా చూసిన అందరికి ఎందుకు ఆ టైటిల్ అనుకున్నానో తెలిసే ఉంటుంది. కానీ  చాలా పెద్ద టైటిల్ అవుతుందనుకుని షార్ట్ చేసేసా నా అంతట నేనే. సినిమా లో అందరూ కొత్తవాళ్ళే ఉన్నారు ఎందుకు..? కావాలని తీసుకున్నారా? లేక బడ్జెట్ కోసమా? బడ్జెట్ అనేది ఒక రీజన్. ఇంకొకటి పెద్ద పెద్ద వాళ్లంతా వేరే సినిమా లతో బిజీగా వున్నారు. కానీ మా సినిమా లో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఏ టైం కి రమ్మంటే ఆ టైం కి లొకేషన్ లో ఉండి, నాకు అసలు ఇబ్బంది అనేది తెలియకుండా చేసారు. సినిమా మొత్తం లో మీకు డైరెక్ట్ చేయడానికి కష్టమనిపించింది షాట్ ఏమైనా ఉందా? ఆర్టిస్టు లతో అలాంటి ఇబ్బంది రాలేదు కానీ టెక్నికల్ ప్రాబ్లెమ్స్ వల్ల క్లైమాక్స్ సీన్ కొంచెం కష్టమనిపించింధి. హీరోయిన్ గా మీకు ఇదే మొదటి సినిమా కదా? అవునండి అంతకి ముందు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, ఈటీవీ లో హృదయం అనే సీరియల్ చేశాను. కానీ సినిమా అయితే ఇదే మొదటిది. మీ గురించి.. నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన తెలుగమ్మాయిని. ప్రెజెంట్ బాచిలర్స్ చేస్తున్నాను. కథ వినగానే మీకేం అనిపించింది..? చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. సొసైటీ కి చాలా దగ్గరగా ఉన్న కథ, అందరికి నచ్చుతుంది అనిపించింది. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు కదా మీకు ఈ క్యాస్ట్ గోలలు పెద్దగా తెలియవేమో.. అలా ఏం ఉండదండి. ఎక్కడైనా ఇవి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ త్వరగా బయటపడి చెప్పుకోరు అంతే. మీరు క్యాస్ట్ తో ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? ఇప్పటివరకు నాకు అయితే అలాంటి ప్రాబ్లెమ్స్ ఏమి రాలేదు. టెర్రస్ మీద, ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి కదా ఎలా మేనేజ్ చేసారు..? రిహార్సల్స్.. సినిమా ఓకే అయిన దగ్గర్నుంచి డైలీ సీన్స్ ని రిహార్సల్స్ చేసేదాన్ని.. దాదాపు 15 రోజులు పాటు రిహార్సల్స్ చేసాం సినిమా చూసాక మీకు వచ్చిన బెస్ట్ కంప్లిమెంట్ ఏంటి ? బాగా చేసావు. అసలు ఊహించలేదు అన్నారు ప్రతి ఒక్కరూ.. వాళ్ళు మరి ఎలా ఊహించుకున్నారో కానీ(నవ్వుతూ..) అంటే ఇది నీకు ఫస్ట్ సినిమా లా లేదు.. చాలా బాగా చేశావన్నారు.. ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా ? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. రెండు మూడు కాల్స్ వచ్చాయి. ఇంకా స్టడీస్ పూర్తవలేదు కదా.. మరి యాక్టింగ్ కంటిన్యూ చేస్తారా? మాములు గా నా ప్లాన్ అయితే బాచిలర్స్ అయ్యాక యాక్టింగ్ సైడ్ వద్దామని. కాకపోతే ఈ సినిమా తో కొంచెం ముందుగానే అవకాశం వచ్చింది. సినిమాలని కంటిన్యూ చేస్తా..  

ఆడియన్స్‌కి నచ్చే అన్ని అంశాలతో ‘మళ్ళీ మళ్ళీ చూశా’ ఒక ఫుల్ మీల్స్‌లా ఉంటుంది – హీరో...

క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ''మళ్ళీ మళ్ళీ చూశా''. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా...

ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ నిర్వహిస్తున్న “మయూఖా టాకీస్ “

యాక్టింగ్ స్కూల్ సర్టిఫికెట్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు( అక్టోబర్ 15) ఫిలిం ఛాంబర్లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాలులో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు తేజ, సురేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక...