రెండు గెట‌ప్స్ లో క‌న‌ప‌డ‌నున్న బ‌న్నీ

0
3056
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ త‌న త‌దుప‌రి సినిమాను త్రివిక్ర‌మ్ తో అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే నెల 8 బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమాను లాంఛ్ చేసి, ఏప్రిల్ రెండో వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ను ప్రారంభించే విధంగా స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. దాని కోసం బ‌న్నీని కాస్త బ‌రువు త‌గ్గ‌మ‌ని త్రివిక్ర‌మ్ సూచించ‌గా, బ‌న్నీ ప్ర‌స్తుతం అదే ప‌నిలో ఉన్నాడ‌ని తెలుస్తుంది. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, కేథ‌రిన్ ల‌ను హీరోయిన్లు గా ఫైన‌లైజ్ చేశార‌ని స‌మాచారం. గత కొన్ని సినిమాలుగా ప‌రాజయాల పాలైన బ‌న్నీ.. ఈ సినిమా పైనే త‌న ఆశ‌ల‌న్నీ పెట్టుకున్నాడు.