బన్నీ ఫ్యాన్స్ ను భయపెడుతోన్న త్రివిక్రమ్

0
182
త్రివిక్రమ్.. ఒకప్పుడు మాటల మాంత్రికుడుగా తిరుగులేని ముద్ర వేశాడు. కానీ గత కొంత కాలంగా ఆ ముద్ర తప్పిందనేది నిజం. పైగా ఆయన మాటల మనిషే కానీ మంచి కథలు రాసుకోలేడు అనేది ముందు నుంచీ ఉన్నదే. అందుకే ఈ మధ్య మరీ ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది అజ్ఞాతవాసితో ఆల్ టైమ్ ఫ్లాప్ చూసిన త్రివిక్రమ్ అరవింద సమేతతో కొంత వరకూ సేఫ్ అయ్యాడు. అయితే ఇప్పుడు అజ్ఞాతవాసి టైమ్ లో  చేసిన తప్పునే మళ్లీ చేయబోతున్నాడనే వార్తలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను భయపెడుతున్నాయి. మరి ఇందులో నిమజెంతా అనేది తెలియదు కానీ.. ఈ వార్తకు అజ్ఞాతవాసికి గట్టి సంబంధం మాత్రం ఉంది.
అజ్ఞాతవాసి సినిమా ‘లార్గో వించ్’ అనే ఓ ఫ్రెంచ్ సినిమాకు కాపీ అని అందరికీ తెలుసు. ఆ విషయం సినిమాకు ముందు ఒప్పుకోలేదు త్రివిక్రమ్. కానీ చివరికి అదే నిజమైంది. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాను ఇక్కడ డిజాస్టర్ చేశాడు త్రివిక్రమ్. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం కూడా ఓ హాలీవుడ్ సినిమాను తెస్తున్నట్టు చెబుతున్నారు. ‘ది ఇన్వెన్షన్ ఆఫ్ లైయింగ్’ అనే చిత్రాన్ని తెస్తున్నట్టు చెబుతున్నారు. కానీ నిజానికి ఈ సినిమా కూడా మన ఏప్రిల్ 1 విడుదల కథలా ఉంటుంది. చిన్న రివర్స్  పాయింట్ తో. దీంతో ఈ సినిమాతో మళ్లీ అల్లు అర్జున్ కు ఎక్కడ ఫ్లాప్ ఇస్తాడో అనే భయంలో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్. మొత్తంగా ఈ నెల మూడో వారం నుంచే షూటింగ్ ప్రారంభం కాబోతోన్న ఈ చిత్ర కథ గురించి ఎవరికీ ఏమీ తెలియదు కాబట్టి.. ప్రస్తుతానికి దీన్ని రూమర్ గానే చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here