రవితేజ నక్కను తొక్కాడా..?

0
2726
మాస్ మహరాజ్ గా ఓ వెలుగు వెలిగిన రవితేజ కొన్నాళ్లుగా ఆ ప్రాభవం కోల్పోయాడు. వరుసగా వస్తోన్న డిజాస్టర్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ.. కథలు మార్చడం లేదు. పైగా ఇంకా తనదైన పాత బాడీ లాంగ్వేజ్ తోనే పాకులాడుతున్నాడు. ఇది అతనికి పెద్ద మైనస్ గా మారింది. మొత్తంగా ఇక రవితేజ పని అయిపోయిందనుకున్న ప్రతిసారీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే.. అతను బౌన్స్ అయినప్పుడేమీ కూడా పెద్ద హిట్లు పడటం లేదు. అయినా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం డిస్కోరాజా అనే సినిమా చేస్తోన్న మాస్ రాజాకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. అఫ్ కోర్స్ ఇది పాతదే. కానీ ఇందులో జాయిన్ అవుతోన్న భామలతో ఈ ప్రాజెక్ట్ కే కొత్త కలర్ రాబోతోంది.
యస్.. కొన్నాళ్ల క్రితం తమిళ్ స్టార్ విజయ్ నటించిన తెరి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు అని కూడా చెప్పారు. బట్.. ఆ ప్రాజెక్ట్ నుంచి పవన్ తప్పుకున్నాడు. పాలిటిక్స్ కు వెళ్లాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడుగా సంతోష్ శ్రీనివాస్ ను తీసుకుంది మైత్రీ మూవీస్ సంస్థ. ఆల్రెడీ అతను కథలో తెలుగుకు కావాల్సిన మార్పులన్నీ చేసి ఉన్నాడు. దీంతో స్టోరీ రవితేజ వద్దకు వెళ్లింది. అతనూ ఓకే చెప్పాలా వద్దా అనే ఊగిసలాట నుంచి ఫైనల్ గా ఓకే చెప్పాడు. దీంతో ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు సంబంధించి స్పీడ్ పెంచింది మైత్రీ మూవీస్ సంస్థ. ఈ క్రమంలో ఈ సినిమాలో నటించబోతోన్న హీరోయిన్లను చూస్తే ఖచ్చితంగా రవితేజ మరోసారి లక్కీ అని చెప్పాలి.
తెరి సినిమా తెలుగులో ‘పోలీసోడు’గా డబ్ అయింది కూడా. అయినా రీమేక్ చేస్తున్నారు. అందుకే ఆ కలరింగ్ అస్సలు లేకుండా పూర్తిగా టైటిల్ నుంచే మార్పులు చేస్తున్నారు. అందుకే మాస్ రాజా ఇమేజ్ కు దూరంగా ఈ చిత్రానికి ‘కనక దుర్గ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరో తెలుసా.. కాజల్ అగర్వాల్ అండ్ కేథరీన్ థ్రెస్సాలను తీసుకున్నారట. ప్రస్తుతం కాజల్ వీర ఫామ్ లో ఉంది. కాకపోతే రవితేజతో అమ్మడికి మంచి ట్రాక్ రికార్డ్ లేదు. గతంలో వీరి కాంబినేషన్ లో వీర, సారొచ్చారు వంటి ఊర ఫ్లాపులు ఉన్నాయి. ఏమో ఈ సారి ఆ ట్రాక్ రికార్డ్ మారొచ్చేమో. కనకదుర్గ హిట్ కావొచ్చేమో.. అన్నట్టు. కనక దుర్గ అనగానే ఇవి హీరోయిన్ల పేర్లు అనుకునేరు. కాదు.. సినిమా విజయవాడ నేపథ్యంలో నడుస్తుందన్నమాట.
మరి ఈ సినిమా హిట్ అయితే ఒకేసారి హీరోతో పాటు దర్శకుడికీ కొంత రిలీఫ్ అవుతుంది.