బోయపాటి పేరు వింటే ఉలిక్కిపడుతోన్న టాలీవుడ్

0
908

బోయపాటి శ్రీను.. దర్శకుడుగా అతనిది ప్రత్యేకమైన ముద్ర. ఎమోషనల్ స్టోరీస్ కు యాక్షన్ కోట్ తో ఎంటర్టైన్ చేయడం అతని స్టైల్. కానీ చాలా వరకూ అతను యాక్షన్ కే పెద్ద టేబుల్ వేస్తాడు. దీనివల్ల చాలాసార్లు అతని సినిమాల్లో శ్రుతి మించిన రక్తపాతం కూడా కనిపిస్తుంది. అలా ఉన్న సినిమాలు కూడా హిట్ కావడంతో అదే తన స్ట్రెంత్ గా ఫీలయ్యాడు బోయపాటి. పైగా విజయాలు తెచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ అతన్లో స్థాయికి మించి ఫామ్ అయింది. దీనివల్ల ఎవరైనా అతని సినిమాలను విమర్శించినా వారికే కౌంటర్స్ ఇస్తుంటాడు. సరే ఇవన్నీ హిట్స్ ఉన్నంత వరకూ బానే ఉంటాయి. ఒక్కసారి తేడా కొడితే అప్పుడు తెలుస్తుంది. ఇది అనుభవమైతే కానీ అర్థం కాదు అంటారు. ఫైనల్ గా బోయపాటికి ఈ అనుభవం ఎదురైంది. అది కూడా మామూలుగా కాదు. ఇన్నాళ్ల విజయాలన్నీ మర్చిపోయేంత బ్యాడ్ ఎక్స్ పీరియన్స్..

వినయ విధేయ రామతో బోయపాటి ఇచ్చిన డిజాస్టర్ చూసి చాలామంది హీరోలు బెదిరిపోతున్నారు. ఇప్పటి వరకూ అతనితో సినిమా చేద్దాం అని మనసులో అనుకున్న వాళ్లు కూడా ఈ ఫ్లాప్ చూసి ఉలిక్కి పడుతున్నారట. మామూలుగానే ఒక్కో సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకునే బోయపాటికి ఇక మరో స్టార్ హీరో(బాలయ్య తప్ప) డేట్స్ ఇవ్వడం దాదాపు అసాధ్యం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ కమిట్ అయ్యాడు కాబట్టి బాలయ్య సినిమా ఉంటుంది కానీ.. వినయ విధేయ రామ చూసిన తర్వాత బాలయ్య కూడా కాస్త భయపడుతున్నట్టు చెబుతున్నారు. పైగా వీరికి కాంబినేషన్ క్రేజ్ ఉంటుంది. అంచనాలు భారీగా ఉంటాయి. వాటిలో ఏ మాత్రం తేడా కొట్టినా మరో డిజాస్టర్ తప్పదు.
మొత్తంగా వినయ విధేయ రామ చూశాక బోయపాటి పేరు వింటే చాలు స్టార్ హీరోలే కాదు.. నిర్మాతలు కూడా ఉలిక్కిపడుతున్నారట. మరి ఇకనైనా తన పంథా మార్చుకుంటాడా లేక మళ్లీ అదే రొడ్డకొట్టుడుతో వెళతాడా అనేదానిపైనే అతని ఫ్యూచర్ కెరీర్ ఆధారపడి ఉంటుందనేది మాత్రం నిజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here