కుర్రాడు కుమ్మేస్తున్నాడుగా..?

0
256

బెల్లంకొండ శ్రీనివాస్.. అల్లుడు శీనుగా వచ్చి అదృష్టం పరీక్షించుకున్నాడు అనుకున్నారు చాలామంది. కానీ అతను లక్ చెక్ చేసుకోవడానికి రాలేదు. టాలీవుడ్ లో జెండా పాతడానికే వచ్చాడు. అది కూడా మాస్ హీరోగా. అందుకే ప్రతి సినిమాలోనూ ఊరమాస్ గానే కనిపిస్తున్నాడు. యాక్టింగ్ రాకపోయినా డ్యాన్సులు ఫైట్లతో ఆకట్టుకుంటున్నాడు. కాకపోతే కుర్రాడికి మంచి కథలు పడటం లేదు. పడ్డ కథలు కూడా బడ్జెట్ తెచ్చే క్రేజ్ రాలేదు. అయినా అతని వేగం ఆగడం లేదు. స్పీడున్నోడు అనే టైటిల్ తో సినిమా చేసిన శ్రీనివాస్ నిజంగానే ఆ టైటిల్ కు జస్టిఫికేషన్ చేస్తున్నాడు. మరోవైపు ఇండస్ట్రీలో కూడా అతని జయాపజయాలతో పనిలేకుండా వరుసగా కొత్త కొత్త ఆఫర్స్ వస్తుండటం అతన్ని ఫ్యూచర్ లో స్టార్ గా చూస్తామనే దానికి సంకేతంగా చెప్పొచ్చు. శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన కొత్త సినిమాల లిస్ట్ చూస్తే అతని వేగం అర్థమవుతుంది.

ప్రస్తుతం శ్రీనివాస్ తేజ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి ‘సీత’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు టాక్. మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా ఆల్రెడీ అనౌన్స్ అయింది. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో సినిమా కూడా కన్ఫార్మ్ చేశాడు. ఈ సినిమా కోస్టల్ కారిడార్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్. కాకపోతే మరో హీరో కూడా ఉంటాడు. ఇవి కాక ఇప్పుడు శ్రీనివాస్ చేస్తున్నాడు అంటూ మరో సినిమా కూడా వినిపిస్తోంది.

గతేడాది తమిళ్ లో వచ్చిన సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమా ‘రాక్షసన్’. ఈ సినిమా రైట్స్ ను తెలుగులో నితిన్ కొన్నాడు. దీంతో అతనే హీరోగా నటిస్తాడు అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా వినిపిస్తోన్న వార్తేంటంటే.. ఈ మూవీలో కూడా బెల్లంకొండనే హీరోగా నటించబోతున్నాడట. అంటే నితిన్ ఈ సినిమాను మరొకరికి అమ్మేశాడా లేక వాళ్ల బ్యానర్ లో తనే నిర్మిస్తాడా అనేది ఇంకా తెలియదు కానీ ఈ రీమేక్ లో నటించేది మాత్రం శ్రీనివాసే అంటున్నారు. మరోవైపు అజయ్ భూపతి ఈ రీమేక్ ను హ్యాండిల్ చేస్తాడు అనే మాట కూడా వినిపిస్తోంది. ఏదేమైనా కుర్రాడి దూకుడు చూసి చాలామంది యంగ్ స్టర్స్ సైతం షాక్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here