Tuesday, March 19, 2019
Home News Entertainment news సోకుల పంచ్ విసిరిన బాక్సింగ్ బ్యూటీ

సోకుల పంచ్ విసిరిన బాక్సింగ్ బ్యూటీ

0
2492
ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన బ్యూటీస్ లో ఈ మధ్య కాలంలో రితికా సింగ్ ను కూడా చెప్పొచ్చు. కానీ తను ఎంట్రీ ఇచ్చిన సినిమా నేపథ్యం వల్ల అమ్మడు ఎక్కువగా ఫోకస్ కాలేకపోయింది కానీ.. లేకపోతే ఇదుగో ఇన్ని సోకులు పెట్టుకుని కూడా టాలీవుడ్ అమ్మడిని పట్టించుకోకపోవడం ఏంటీ.. ఆ మాటకొస్తే తను పరిచయం అయిన కోలీవుడ్ కూడా కాస్త చిన్నచూపే చూస్తున్నట్టు చెప్పాలి. ప్రొఫెషనల్ బాక్సర్ గా నేషనల్ లెవెల్ ప్లేయర్ అయిన రితికా సింగ్ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. ఆనక ఇక బాక్సింగ్ ను కాస్త పక్కనబెట్టేసింది. కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. తెలుగులోనూ గురు తర్వాత మరో సినిమా చేసింది. బట్ అమ్మడికి లక్ చిక్కలేదు. అయితే ఇక్కడ సర్వైవ్ కావాలంటే బాక్సింగ్ పంచ్ లే కాదు.. ఇదుగో ఇలా సోకుల పంచ్ లు కూడా వేయాలని డిసైడ్అయినట్టుంది. అందుకే చాలామందిని ఆశ్చర్యపరుస్తూ కాస్త ఎక్కువగానే సోకులు ఆరబోసింది. వైట్ అండ్ వైట్ లో మత్తెక్కించే లుక్ తో చిరుగులు పడిన డ్రెస్ లో చింపేస్తోందంతే. మొత్తంగా రితికా వేసిన ఈ సోకుల పంచ్ కు ఇన్ స్టాగ్రామ్ హీటెక్కిపోతోందిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by :