అల్లు అర్జున్ కూ ఆ భామే కావాలట

0
327
అల్లు అర్జున్.. ఫైనల్ గా ఆరు నెలల సైలెన్స్ ను బ్రేక్ చేసి కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమా ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. ప్రారంభం అయిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళుతుందీ యూనిట్. ఈ లోగా బన్నీ పాలకొల్లు వెళ్లి సంక్రాంతి పండగను తమ పూర్వీకులతో కలిసి సెలబ్రేట్ చేసుకని వస్తాడు. ఇక హారిక హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ సెన్షేషనల్ బ్యూటీని తీసుకోవాలనుకుంటున్నట్టు టాక్.
భరత్ అనేనేనుతో భలే ఉందే అనిపించుకున్న బ్యూటీ కియారా అద్వానీని త్రివిక్రమ్ సినిమాలో తీసుకోవాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. భరత్ తర్వాత భారీ ఆఫర్స్ వచ్చినా ఈ బ్యూటీ మాత్రం అటు బాలీవుడ్ కూ సమాన ప్రియారిటీ ఇస్తూ రెండు భాషలనూ బ్యాలన్స్ చేస్తూ వెళుతోంది. అందుకే ఆ వెంటనే సెలెక్టెడ్ గా వెళ్లింది. రామ్ చరణ్, బోయపాటిల సినిమాకు ఓకే చెప్పింది. వినయవిధేయ రామగా వస్తోన్నఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తనను తమ సినిమాలో తీసుకోవాలనుకుంటున్నారట..
ప్రస్తుతం కియారా చాలా బిజీగా ఉంది. బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్స్ కూడా చేస్తోంది. అయితే త్రివిక్రమ్ వంటి దర్శకుడు, మెగా ఫ్యామిలీలో మరో హీరోతో ఆఫర్ అంటే వదులుకుంటుందా.. మరోవైపు బాలీవుడ్ లో ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఓ సినిమాలో తనే హీరోయిన్ అనే రూమర్స్ వస్తున్నాయి. కానీ తను కాదంటోంది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే త్రివిక్రమ్ కు టెన్ టైమ్స్ బెటర్ గా కనిపించే ఇంతియాజ్ ఓకే చెబుతుందా ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెబుతుందా అనేది కూడా ఆలోచించాల్సిన అంశమే. అయితే అల్లు అర్జున్ మాత్రం తనకు కియారానే కావాలని పట్టుబడుతున్నాడని కూడా వినిపిస్తోంది. సో.. ఆల్మోస్ట్ ఈ సినిమాలో హీరోయిన్ తనే అనుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here