ప‌ద‌హారేళ్ల ‘మెగా’ ప్ర‌యాణం

0
155
తెలుగు తెరకు ‘గంగోత్రి’ సినిమా ద్వారా హీరోగా అల్లు అర్జున్ పరిచయమయ్యాడు. ఆ తరువాత నటన పరంగా .. డైలాగ్స్ పరంగా .. డాన్స్ పరంగా .. తనని తాను మలుచుకుంటూ .. మార్చుకుంటూ ఆయన ముందుకుసాగాడు. ఆయన చేసిన నిరంతర కృషి కారణంగా ‘స్టైలిష్ స్టార్’ అనిపించుకోవడానికీ .. స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. నటుడిగా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 16 యేళ్లు పూర్తయింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయడానికి సిద్ధమవుతున్నాడు. గీతా ఆర్ట్స్ వారితో కలిసి ఈ సినిమాను హారిక & హాసిని క్రియేష‌న్స్ వారు నిర్మిస్తున్నారు. నటుడిగా 16 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ కి ప‌లువురు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో విజయాలను అందుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తో తాము చేయనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకోనుందనీ .. ఆ పనులు పూర్తికాగానే అన్ని వివరాలను తెలియజేస్తామని ఆయన అభిమానులకు కూడా క్లారిటీ ఇచ్చేశారు.

ఒక పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చిన అల్లు అర్జున్ త‌న ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకుని ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డాడు. త‌న మామ చిరంజీవి డాడీ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించిన అల్లు అర్జున్.. హీరోగా రాఘ‌వేంద్రరావుతో తొలి సినిమా చేసి ప్రేక్ష‌కుల నుంచి మంచి క్రేజ్ తెచ్చుకుని ఒక మంచి హీరోగా పేరు తెచ్చుకుని మోగా ఫ్యామిలిలో మంచి హీరో అల్లు అర్జున్ పేరు తెచ్చుకున్నాడు.