ఎహే.. అల్లరోడు సేఫ్

0
168
అల్లరి నరేష్.. దశాబ్ధంకు పైగా తనదైన శైలిలో నవ్వించిన కామెడీ హీరో. రాజేంద్ర ప్రసాద్ వారసుడుగానూ చెప్పుకున్నారు ఓ దశలో. కానీ తండ్రి మరణం తర్వాత అల్లరి నరేష్ సినిమాలు హాస్యం తప్పాయి. రెగ్యులర్ గా అన్ని సినిమాలూ ఒకేలా ఉండటం.. సరైన స్క్రిప్ట్ ఎంచుకోలేకపోవడంతో మనోడు ఆడియన్స్ ను నవ్వించడం అటుంచి.. నిర్మాతలను ఏడిపించడం మొదలుపెట్టాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించి ఇప్పటికే చాలా రూమర్స్ బయటకు వచ్చాయి. నరేష్, మహేష్ ఇద్దరూ ఫ్రెండ్స్ అనీ.. ముందు నుంచీ వినిపిస్తూనే ఉంది. అది నిజమే అనేలా ఆల్రెడీ రిలీజ్ చేసిన పోస్టర్స్ చెబుతున్నాయి. అయితే లేటెస్ట్ గా వస్తోన్న రూమర్ మాత్రం నిజం కాదని తేలిపోయింది.
మామూలుగా మన సినిమాల్లో ఓ స్టార్ హీరోకు ఫ్రెండ్ అంటే అతను చనిపోవడమో.. లేక అతని కుటుంబం అన్యాయానికి గురికావడమో ఉంటుంది. అందువల్ల నరేష్ పాత్ర కూడా చనిపోతుందని ఈ మధ్య గాసిప్ రాయుళ్లు రెచ్చిపోయారు. కానీ అలాంటిదేం లేదు. నరేష్ పాత్ర చనిపోదు కానీ.. ఆల్మోస్ట్ ఆ స్టేజ్ కు వస్తుందట. అతను వ్యవసాయం చేస్తుంటాడు. అక్కడ వచ్చిన సమస్యల వల్ల ఆత్మహత్యకు ప్రయత్నించే మాట నిజమే.. కానీ చనిపోడు అంటున్నారు. సో నరేష్ పాత్ర కోసమే మహేష్ బాబు అమెరాకాలో చేస్తోన్న ఉద్యోగం మానేసి ఇండియా వచ్చిన ఇక్కడ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాడట. మొత్తంగా నరేష్ ఈ సినిమాకు సేఫ్ అన్నమాట.