రొమాంటిక్ గా మొద‌లుపెట్టిన పూరి ఆకాష్

0
1892

ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరీ గ్యాప్ తీసుకుని మెహ‌బూబా సినిమాతో ప్రేక్ష‌కుల్ని మెప్పించే ప్ర‌య‌త్నం చేసి..త‌న న‌ట‌న‌కు మంచి మార్కులైతే కొట్టేసాడు కానీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆడ‌లేదు. ఇప్పుడు ఆకాష్ మ‌రో సినిమాతో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. త‌న తాజా చిత్రం ‘రొమాంటిక్’ ను ఈ రోజే లాంఛ్ చేశారు. నంద‌మూరి కళ్యాణ్ రామ్ ఈ ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. మూవీ లాంఛ్ కార్య‌క్రమానికి సీనియర్ న‌టి ర‌మాప్ర‌భ కూడా హాజ‌ర‌య్యారు. సినిమా లాంఛ్ త‌ర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని షూటింగ్ మొద‌లుపెట్ట‌డం అన్న‌ట్లు కాకుండా డైరెక్ట్ గా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ శిష్యుడు అనిల్ పాడూరి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్నాడు.

స్వ‌యంగా పూరీ జ‌గ‌న్నాథ్ యే ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్నాడు. టైటిల్ కు త‌గ్గ‌ట్టే ఈ సినిమా మొత్తం రొమాంటిక్ గా సాగ‌నుంద‌ట‌. ఈ సినిమాను పూరీ, ఛార్మీ సంయుక్తంగా పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ బ్యాన‌ర్ల‌పై నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here