రజినీకాంత్ కు షాక్ ఇచ్చిన అజిత్

0
882

ఇద్దరు సూపర్ స్టార్స్ బాక్సాఫీస్ వార్ లో ఉంటే బాటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సంక్రాంతికి కోలీవుడ్లో ఇలాగే ఇద్దరు సూపర్ స్టార్స్ బాక్సాఫీస్ బరిలో తలపడ్డారు. ఒకరు తలైవా.. మరొకరు తలా… అంటే రజినీకాంత్, అజిత్. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలక రాన్రానూ ఓపెనింగ్స్ తగ్గిపోతున్నాయి. ఈ మధ్య ఆయన చేస్తోన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటమో లేక అంచనాలను ఏ మాత్రం రీచ్ కాకపోవడమో అందుకు కారణంగా చెప్పొచ్చు. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో కలిసి చేసిన పేటా కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ఇక చాలాయేళ్ల తర్వాత రజినీకాంత్ తో పోటీగా బరిలోకి దిగాడు అజిత్. అతని ప్రీవియస్ మూవీ వివేగం ఫ్లాప్ కావడంతో అదే దర్శకుడితో మరోసారి విశ్వాసం అంటూ వచ్చాడు.  ఈ సినిమాకు అద్దిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి.

అయితే ఈ సారి కూడా అజిత్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. ఇటు పేటాకు మంచి టాక్ వచ్చింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ యావరేజ్ అన్నారు. దీంతో అటు అజిత్ సినిమాకే మా ఓటు అంటున్నారు ఆడియన్స్. అలా కలెక్షన్స్ పరంగా కూడా ఈ రెండు సినిమాల మధ్య గట్టి తేడానే ఉంది. అంటే రజినీకాంత్ కంటే అజిత్ సినిమాకే హయ్యొస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ కారణం చూపించి ఇప్పుడు చాలామంది రజినీకాంత్ పని ఐపోయిందనే కమెంట్స్ పెంచుతున్నారు. మరీ ఏజ్ బార్ హీరోను ఎంత కాలం చూస్తాం అంటున్నారు. ఏదేమైనా స్టార్డమ్ రేంజ్ అనేవి ఎంత ఉన్నా అవి బాక్సాఫీస్ వద్దా ప్రూవ్ అయితేనే కదా.. ఆ స్టార్ రేంజ్ తెలిసేది. అలా చూస్తే సూపర్ స్టార్ కంటే అజిత్ కాస్త ముందే ఉన్నాడన్నమాటే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here