‘Agent Sai Srinivasa Athreya’ Movie Review

0
879
న‌వీన్ పొలిశెట్టి హీరోగా ప‌రిచ‌యం అవుతూ రూపొందిన సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’. టీజ‌ర్, ట్రైల‌ర్ ల‌తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా మీద అంచ‌నాలు కూడా బానే ఉన్నాయి. దానిక తోడు డిటెక్టివ్ జోన‌ర్ సినిమా కావ‌డంతో ఆడియ‌న్స్ ఆస‌క్తి ఇంకాస్త పెరిగింది. మ‌రి ఏజెంట్ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పించాడన్న‌దే స‌మీక్ష‌లో తెలుసుకుందాం.
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ(న‌వీన్ పొలిశెట్టి) ఎఫ్‌బీఐ పేరిట ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ న‌డుపుతూంటాడు. కేసులు లేక‌పోవ‌డంతో పోలీసుల‌కు చిన్న చిన్న కేసుల్లో సాయ‌ప‌డుతూంటాడు. క‌రెక్ట్ గా అదే టైమ్ త‌న ఫ్రెండ్ అయిన క్రైమ్ రిపోర్ట‌ర్ శిరీష భారీగా అనాథ శ‌వాలు దొరుకుతున్నాయ‌ని చెప్ప‌డంతో ఆ కేసు ను ఇన్వెస్టిగేట్ చేయాల‌నుకుంటాడు. ఆ ప్ర‌య‌త్నంలో ఉండ‌గానే మ‌ర్డ‌ర్ కేసులో ఆత్రేయ‌నే అనుమానితుడిగా పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. జైలులో ఉండ‌గా త‌న కూతురిని ఘోరంగా మాన‌భంగం చేసి హ‌త్య చేశార‌ని ఓ వ్య‌క్తి ఆత్రేయ‌కు చెప్పి, త‌న కూతురికి చ‌నిపోయే ముందు ఫోన్ చేసిన ముగ్గురి ఫోన్ నంబ‌ర్లు ఇస్తాడు. బెయిల్ పై రిలీజ్ అయిన ఆత్రేయ ఆ కేసు ఇన్వెస్టిగేష‌న్ స్టార్ట్ చేస్తాడు. ఆ మూడు నంబ‌ర్ల‌లో ఇద్ద‌రి వివ‌రాలు దొర‌క‌టంతో వారిని ఫాలో అవుతూ ఇన్వెస్టిగేట్ చేస్తుండ‌గానే ఆ ఇద్ద‌రూ హ‌త్య‌కు గుర‌వుతారు. ఆ హ‌త్య కేసుల్లో కూడా ఆత్రేయ‌నే ముద్దాయిగా భావిస్తారు పోలీసులు. దీంతో మ‌రోసారి ఆత్రేయ‌ను అరెస్ట్ చేస్తారు. ఎంతో క‌ష్టం మీద 5 రోజుల బెయిల్ తో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆత్రేయ ఈ కేసుల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డి, అస‌లు మిస్ట‌రీని ఛేదించాడ‌న్న‌ది క‌థ‌.
ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ తో పాపుల‌ర్ అయిన న‌వీన్.. హీరోగా చేసిన మొద‌టి సినిమా ఇదే అయినా, స్టేజ్ ఆర్టిస్ట్ గా మంచి అనుభ‌వం ఉన్న న‌వీన్,ఆత్రేయ పాత్ర‌కు ప్రాణం పోశాడు. సీరియ‌స్ ఇన్వెస్టిగేష‌న్ తో పాటూ, కామెడీ టైమింగ్ తో ఆక‌ట్టుకుని, మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. యాటిట్యూడ్, లుక్స్ విష‌యంలోనూ ప‌ర్ఫెక్ష‌న్ చూపించాడు. స్నేహ పాత్ర‌లో శృతి శ‌ర్మ పెద్దగా న‌ట‌న‌కు ఆస్కారం లేక‌పోయినా ఉన్నంత‌లో బాగానే చేసింది. మిగిలిన వారంతా ఫ‌ర్వ‌వాలేద‌నిపించారు.

డిటెక్టివ్ త‌ర‌హా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకున్న ద‌ర్శ‌కుడు స్వ‌రూప్, తొలి ప్ర‌య‌త్నంలోనే ఆక‌ట్టుకున్నాడు. క‌థ‌ను ఇంట్రెస్టింగ్ గా రాసుకోవ‌డంతో పాటూ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రెజెంట్ చేశాడు. కానీ ఇన్వెస్టిగెటివ్ థ్రిల్ల‌ర్ లో ఉండాల్సిన వేగం మాత్రం సినిమాలో మిస్ అయింది. ఫ‌స్టాఫ్ దాదాపు గా ఆత్రేయ పాత్ర‌ను ఎస్టాబ్లిష్ చేయ‌డానికే స‌రిపోయింది. ఇక సెకండాఫ్ లో ఇన్వెస్టిగెటివ్ సీన్స్ లోనూ స్లో నెరేష‌న్ ఇబ్బంది పెడుతుంది. మార్క్ కె రాబిన్ రీరికార్డింగ్ స‌న్నివేశాల‌న్ని బాగా ఎలివేట్ అయ్యేలా చేసింది. సినిమాలో మేజర్ డ్రా బ్యాక్ అంటే ఎడిటింగ్. అన‌వ‌స‌ర‌మైన సీన్స్ ను చాలా వ‌ర‌కు ఎడిటింగ్ చేస్తే సినిమా స్థాయి మ‌రోలా ఉండేది. సినిమాటోగ్ర‌ఫీ, నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి తగ్గ‌ట్లుగా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
న‌వీన్ పొలిశెట్టి
రీరికార్డింగ్

మైన‌స్ పాయింట్స్ః
స్లో నెరేష‌న్
ఎడిటింగ్

పంచ్‌లైన్ః మిస్ట‌రీ వీడింది!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here